AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ఆటల్లో తోపు.. ఇప్పుడు అందాల్లో టాపు.. ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా..?

చాలా మంది ఒకవేళ హీరోయిన్ అవ్వకపోతే నేను ఆ పని చేసేదాన్ని.. ఇలా సెటిల్ అయ్యేదాన్ని అని పలు సందర్భాల్లో చెప్పారు కూడా.. ఇంకొంతమంది హీరోయిన్స్ గా చేస్తూనే మరోవైపు తమ చదువును పూర్తి చేస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గతంలో స్పోర్ట్స్ లో అదరగొట్టింది. ఆటల్లో తోపుగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్ గా దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అప్పుడు ఆటల్లో తోపు.. ఇప్పుడు అందాల్లో టాపు.. ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా..?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2024 | 6:37 PM

Share

ఇండస్ట్రీలో డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ అయిన వారు ఉన్నారు. అలాగే ‘లా’ చదివి హీరోయిన్స్‌గా మారిన వారు ఉన్నారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలి కూడా సినిమాల్లోకి వచ్చారు. చాలా మంది ఒకవేళ హీరోయిన్ అవ్వకపోతే నేను ఆ పని చేసేదాన్ని.. ఇలా సెటిల్ అయ్యేదాన్ని అని పలు సందర్భాల్లో చెప్పారు కూడా.. ఇంకొంతమంది హీరోయిన్స్ గా చేస్తూనే మరోవైపు తమ చదువును పూర్తి చేస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గతంలో స్పోర్ట్స్ లో అదరగొట్టింది. ఆటల్లో తోపుగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్ గా దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ అమ్మడు. గ్లామరస్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు..

ఇది కూడా చదవండి : గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

తమిళ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ తెలియని వారు ఉండరు. ఆమె పేరు కోమల్ శర్మ. మిస్ తమిళనాడుగా రెండు సార్లు కిరీటం సొంతం చేసుకుంది ఈ చిన్నది. అంతే కాదు ఆమె స్క్వాష్ ప్లేయ‌ర్‌ కూడా.. స్క్వాష్‌లో నేషనల్ ఛాంపియన్ ఈ బ్యూటీ. అప్పుడు స్పోర్ట్స్ లో దుమ్మురేపిన ఈ భామ ఇప్పుడు సినిమాల్లో దూసుకుపోతుంది. తమిళంలోనే కాకుండా, మాలీవుడ్‌, బాలీవుడ్‌ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అలాగే తెలుగులోనూ మెరిసింది కోమల్ శర్మ. అను అనే సినిమాలో నటించింది కోమల్ శర్మ.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఈ అమ్మడు ఎక్కువగా మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్  సినిమాల్లోనూ ఈ బ్యూటీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం కోమల్ శర్మ చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళ్ లో మలయాళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చేస్తుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోమల్ శర్మ మాట్లాడుతూ.. గోట్ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని.. విజయ్ తో ఎక్కువగా కనిపిస్తానని తెలిపింది. అలాగే ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంటుందని.. ఇండస్ట్రీలో నయా ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పుకొచ్చింది కోమల్ శర్మ. వీటితోపాటు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ రెండు సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తుంది కోమల్ శర్మ.

కోమల్ శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి వరకూ ఆ రాశుల వారికి పండుగే పండుగ..!
సంక్రాంతి వరకూ ఆ రాశుల వారికి పండుగే పండుగ..!
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్
మొన్న రూ. 23 కోట్లకుపైగానే.. కట్‌చేస్తే.. నేడు రూ. 7 కోట్లకే
మొన్న రూ. 23 కోట్లకుపైగానే.. కట్‌చేస్తే.. నేడు రూ. 7 కోట్లకే
అటు చలి, ఇటు వర్షాలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..
అటు చలి, ఇటు వర్షాలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..
వాట్సప్‌కు బిగ్ షాక్.. యూజర్ల డేటా షేర్ చేయాలంటే పర్మిషన్
వాట్సప్‌కు బిగ్ షాక్.. యూజర్ల డేటా షేర్ చేయాలంటే పర్మిషన్
రూ. 25.2 కోట్లకు అమ్ముడైనా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే
రూ. 25.2 కోట్లకు అమ్ముడైనా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే
దట్టమైన అడవిలో కనిపించినవి చూసి నివ్వెరపోయిన ఫారెస్ట్ సిబ్బంది..
దట్టమైన అడవిలో కనిపించినవి చూసి నివ్వెరపోయిన ఫారెస్ట్ సిబ్బంది..
Cameron Green IPL Auction 2026: మినీ ఆక్షన్ రికార్డులు బ్రేక్
Cameron Green IPL Auction 2026: మినీ ఆక్షన్ రికార్డులు బ్రేక్
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా.. ఇది ట్రై చేయండి
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా.. ఇది ట్రై చేయండి
అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!
అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!