Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది అదే పేరుతో ఉండటంతో రమ్యశ్రీగా పేరు మార్చుకుంది.

Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్
Ramya Sri
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2024 | 8:00 PM

Share

రమ్యశ్రీ..  చాలా మందికి ఈ భామ గురించి తెలియకపోవచ్చు కానీ చూస్తే ఈమేనా అని ఇట్టే గుర్తుపట్టిస్తారు. నటిగా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య శ్రీ. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది అదే పేరుతో ఉండటంతో రమ్యశ్రీగా పేరు మార్చుకుంది. తెలుగు అమ్మాయి అయిన రమ్యశ్రీ కన్నడ ఇండస్ట్రీలో మొదటిగా నటించింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 30కి పైగా సినిమాల్లో నటించింది రమ్యశ్రీ. కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

రమ్యశ్రీ ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. అయితే బోల్డ్ పాత్రలు చేయడంతో ఆమె చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల చాలా మంది తనను తప్పుడు ఉద్దేశంతో చూశారని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కారులో తనను బలవంతం చేయబోయారని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. నన్ను ఈవెంట్స్ కు పిలవలనుకున్నా.. ఆమె బట్టలు సరిగ్గా వేసుకోదు ఎందుకు అని కామెంట్స్ కూడా చేశారట. అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా రమ్యను పిలిచారట.. ఆతర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుని అని ఆమెను వద్దు కొందరు అన్నారట.. ఆ తర్వాత కొంతమంది బట్టల్లో ఏముంది.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ గా మాట్లాడి తనను ఇన్వైట్ చేశారు అని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసి అంతా షాక్ అయ్యారు. సినిమాల్లో అంత బోల్డ్ గా ఉంటారు బయట చాలా డీసెంట్ గా ఉన్నారు అని షాక్ అయ్యారు. ఓ పెద్దాయన నన్ను ఉద్దేశిస్తూ.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు.. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు అని తెలిపింది. అలాగే తనకు బీ గ్రేడ్ సినిమాలో నటించమని కూడా ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. నీలి చిత్రాల్లో నటించమని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. నేను అలాంటి సినిమాలు చేయను అని గట్టిగా వాదించాను. సినిమాల్లో దర్శకులు చెప్పారని పొట్టి బట్టలు వేసుకుంటాను అంత మాత్రానా అలాంటి సినిమాలు చేయను అని అన్నారు రమ్య శ్రీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.