Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు .

గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి
Prabhas , Venu Swamy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 11, 2024 | 5:10 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ మధ్యకాలంలో తెగ వినిపిస్తుంది. ఈ పెద్దాయన సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. రష్మిక మందన్న, డింపుల్ హయతిలాంటి హీరోయిన్స్ తో పాటు  అషు రెడ్డి, ఇనాయ సుల్తానాలాంటి మరికొంతమంది బుల్లితెర బ్యూటీస్ కూడా ఆయనతో పూజలు చేయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసికొట్టింది.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఇక పై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కామెంట్స్ చేశారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకు ఎవ్వరూ దండలేయలేదు అన్నారు. అలాగే కల్కి పై కూడా కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి : లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్.. ఐరెన్ లెగ్ అని తిట్టిపోశారు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు అందుకున్నస్టార్ హీరోయిన్

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదని అన్నారు మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయ్యింది ఏమంటారు.? అని ప్రశ్నించగా.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు నాకు ఎవ్వరూ దండలేసి కిరీటాలు పెట్టలేదు. అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయ్యిందా.? ఆ సినిమాకు 130కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు.? ప్రభాస్ ఎంత సేపు కనిపించాడు.? అసలు ఆ సినిమా హిట్టా.? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం.! ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా.? అలాంటి పరిస్థితి లేదు అని విమర్శలు చేశారు వేణుస్వామి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి