AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్.. ఐరెన్ లెగ్ అని తిట్టిపోశారు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు అందుకున్నస్టార్ హీరోయిన్

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశాలు రావడం అంటే అంత ఈజీ కాదు. కొంతమంది స్టార్ కిడ్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే మరికొంతమంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. ఈ హీరోయిన్ కూడా అలాంటి వారిలో ఒకరే.. ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నిలబడింది. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి.

లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్.. ఐరెన్ లెగ్ అని తిట్టిపోశారు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు అందుకున్నస్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2024 | 3:59 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తమ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్ షో మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశాలు రావడం అంటే అంత ఈజీ కాదు. కొంతమంది స్టార్ కిడ్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే మరికొంతమంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. ఈ హీరోయిన్ కూడా అలాంటి వారిలో ఒకరే.. ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నిలబడింది. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అలాగే వరుసగా ఫ్లాప్స్ పలకరించడంతో ఐరెన్ లెగ్ అని కూడా ఆమెను విమర్శించారు. అంతే కాదు లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్ కూడా చేశారు. కానీ ఆ విమర్శలన్నీ ఎదురుకొని నిలబడి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్. కేరళలో పుట్టిన ఈ అమ్మడు విద్యాబ్యాసం ముంబైలో చేసింది. చిన్నతనం నుంచి సినిమాల పై ఆసక్తి ఉన్న విద్య బాలన్ ‘సిట్‌కామ్ హమ్ పాంచ్’ అనే సినిమాలో రాధికా అనే పాత్రలో నటించింది. కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఈ చిన్నది. స్టార్టింగ్ లో విద్యాబాలన్ మలయాళ సినిమా చక్రం చేసింది. ఈ సినిమా చేస్తుండగానే ఆమె దాదాపు 12 సినిమాలు సైన్ చేసింది. అయితే చక్రం సినిమా అనుకోకుండా ఆగిపోయింది.

ఇది కూడా చదవండి : జబర్దస్త్ నటుడు చేయాల్సిన హృదయకాలేయం సంపూ చేతికి ఎలా వచ్చిందంటే..

చక్రం సినిమా ఆగిపోవడంతో విద్యాబాలన్‌ ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేశారు. అలాగే సైన్ చేసిన 12 సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో తమిళ్ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. తమిళ్ లో మాధవన్ హీరోగా నటించిన రన్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమె ప్లేస్ లో మీరాజాస్మిన్ ను తీసుకున్నారు. ఇలా అక్కడ కూడా దురదృష్టం వెంటాడింది. దాంతో అక్కడి నుంచి బెంగాలీకి వెళ్ళింది.. అక్కడ ఓ సినిమా చేసి మొత్తానికి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. హిందీలో పరిణీత అనే సినిమా చేసింది. ఈ సినిమా హిట్ అయ్యింది. దాంతో విద్యాబాలన్ కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె బాడీ షేమింగ్ కూడా గురైంది. లావుగా ఉంది అంటూ విమర్శలు చేశారు. అయినా కూడా వెనకడుగు వేయకుండా సినిమాలు చేసి రాణించింది విద్య. ఇక సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది విద్య. ఈ అమ్మడి నటవిశ్వరూపానికి అందరూ ఫిదా అయ్యారు. ఆతర్వాత భుల్ భులయ్యా, బేగం జాన్, మిషన్ మంగళ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.

విద్య బాలన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.