AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirzapur 3: మీర్జాపూర్ 3లో రెచ్చిపోయిన సలోని భాబీ ఎవరో తెలుసా.. ? కుర్రాళ్ల హృదయాలను దొచేసిన నేహా..

ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.

Mirzapur 3: మీర్జాపూర్ 3లో రెచ్చిపోయిన సలోని భాబీ ఎవరో తెలుసా.. ? కుర్రాళ్ల హృదయాలను దొచేసిన నేహా..
Neha Sargam
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2024 | 4:06 PM

Share

మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సిరీస్ ద్వారా ఇప్పటివరకు చాలా మంది సినీతారలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న తారలకు పాపులారిటీని తీసుకువచ్చింది మీర్జాపూర్ సిరీస్. ఈక్రమంలోనే ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.

సలోని త్యాగి పాత్రలో నటించిన బ్యూటీ నేహా సర్గమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మీర్జాపూర్ 3 సిరీస్ ద్వారా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. బీహార్‌లోని పాట్నాకు చెందిన నేహా.. అసలు పేరు నేహా దూబే. పాట్నాలో చదువు పూర్తయ్యాక తల్లి, చెల్లితో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యింది. సినీ పరిశ్రమలో సింగర్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాల్గొంది. కానీ అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆ షో నుంచి బయటకు వచ్చింది.

ఆ తర్వాత రాజన్ షాహి తన సీరియల్లో నేహాకు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. కానీ నేహా తల్లిదండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంతో చాంద్ చూపా బాదల్ మే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న నేహా.. 2012లో రామాయణ్: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్ లో సీత పాత్రలో నటించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సీరియల్లో నటించిన నటుడు నీల్ భట్ కూడా రామాయణ్ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్లు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

నేహా సర్గమ్ పౌరాణిక షోలలోనే ఎక్కువగా నటించింది. రామాయణ్, యశోమతి మైయా, పరమావతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..