AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంగ్లిష్‌లో ఇరగదీసిన అమరావతి ఆటో డ్రైవర్.. ఒక్కో డైలాగ్‌ వింటుంటే ఉంటుందీ..!

ఇంగ్లీషులో మాట్లాడండి. అంటూ ఆటోవాలా ఇంగ్లీష్‌లో అదరగొడుతుంటే.. వెనుక సీటులో ఉన్న ప్రయాణికుడు నోరెళ్ల బెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 25న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ వీడియోకు నెటిజెన్లు కూడా పెద్ద సంఖ్యలో కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఇంగ్లిష్‌లో ఇరగదీసిన అమరావతి ఆటో డ్రైవర్.. ఒక్కో డైలాగ్‌ వింటుంటే ఉంటుందీ..!
Auto Driver
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2024 | 8:39 PM

Share

మనందరం ఆటోలో తప్పనిసరిగా ప్రయాణిస్తుంటాం.. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆటోలకు ఫుల్లు గిరాకీ ఉంటుందనే చెప్పాలి. ఇకపోతే, దాదాపు ఆటో డ్రైవర్లు తమ స్థానిక బాష, లేదంటే హింధీలోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ, ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆటో నడుపుతున్న ఓ పెద్దాయన ఇంగ్లీష్ ఇరగదీస్తున్నాడు. అతడు మాట్లాడిన తీరు నెటిజెన్లను నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి, లండన్, అమెరికా, పారిస్ వంటి ప్రదేశాలు చూసి రావలంటే ఇంగ్లీష్ తప్పని సరిగా నేర్చుకోవాలని ప్రోత్సాహిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోషేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మహారాష్ట్రలోని అమరావతిలో వెలుగు చూసింది ఈ ఘటన.

అమరావతిలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ మాట్లాడిన తీరు నెటిజెన్లను ఆకట్టుకుంది. ఇంగ్లీష్ ఎంతో వేగంగా, స్పష్టంగా మాట్లాడుతున్న ఆటోవాలా తీరుకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఇంగ్లిష్‌లో మాట్లాడటం వింటే ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారా? అనే సందేహం కలుగక మానదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో క్యాప్షన్‌లో ఇలా రాసి ఉంది..ఈ రోజు, నేను ఒక పెద్ద మనిషిని కలిశాను.. అతని పరిచయం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతను ఒక ఆటో డ్రైవర్.. అతను మాతో చాలా సరదాగా మాట్లాడాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అతను ఇంగ్లీషులో మాట్లాడిన తీరు తమను గుక్కతిప్పుకోకుండా చేసింది. అతడు ఇంగ్లీష్‌ బాషను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు.. ప్రజలు ఇంగ్లీషు నేర్చుకోవటానికి ప్రోత్సాహించే అతని ప్రయత్నం ఎంతో ఆశ్చర్యకరం” అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఆ వీడియోలో పెద్దాయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. “నేను చెప్పేది శ్రద్ధగా వినండి, మీకు ఇంగ్లీషు భాష తెలిస్తే లండన్, పారిస్, అమెరికా వంటి దేశాలు చుట్టి రావొచ్చు. మీకు ఇంగ్లీషు రాకపోతే అక్కడికి వెళ్లలేరు అని ఆటో డ్రైవర్ అన్నాడు. అంతేకాదు.. అందుకు ఉదాహరణ కూడా చెబుతున్నాడు.

లండన్‌కి వెళ్లినప్పుడు, హోటల్‌లో వెయిటర్‌ని మరాఠీలో ఒక గ్లాసు నీళ్ల కోసం అడిగితే. అతను మిమ్మల్ని అక్కడి నుండి వెళ్లిపోమంటాడు.. అని చెబుతున్నాడు. అందుకే మీకు చెప్తున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీషులో మాట్లాడండి. అంటూ ఆటోవాలా ఇంగ్లీష్‌లో అదరగొడుతుంటే.. వెనుక సీటులో ఉన్న ప్రయాణికుడు నోరెళ్ల బెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 25న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ వీడియోకు నెటిజెన్లు కూడా పెద్ద సంఖ్యలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..