Viral Video: అరె ఇదేంటి..? తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి..
సముద్రతీరానికి వింత జంతువు కొట్టుకొచ్చింది అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ జీవి రూపం మాత్రం విచిత్రంగా ఉంది. ముఖం ఆవును పోలి ఉంది. కొమ్ములు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన శరీరం అంతా డాల్ఫిన్‌లా ఉంది.
నెట్టింట రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఎడిటెడ్ వీడియోస్ కూడా ఉంటున్నాయి. దీంతో నిజం ఏదో ఫేక్ ఏదో తెలుసుకోవడం కష్టతరంగా మారింది ఈ మధ్య డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో.. కొంచెం కూడా అనుమానం రాకుండా ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు నెటజన్లు. తాజాగా సముద్రం తీరానికి ఓ వింత జంతువు కొట్టుకొచ్చింది అన్న వీడియో తెగ వైరల్ అవుతోంది.. అందులో ఓ పెద్ద చేప చూడటానికి డాల్ఫిన్ ఆకారంలో ఉంది. అయితే ముఖం మాత్రం ఆవును పోలి ఉంది. దాని చుట్టూ జనాలు కూడా నిలబడి ఉండటం మీరు చూడవచ్చు. కొంతమంది ఇలాంటి వింత జంతువును తామెప్పుడూ చూడలేదని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఇది పక్కాగా ఫేక్ వీడియో అనేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోపై మీ ఒపినీయన్ ఏంటి…?
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Jul 11, 2024 06:49 PM
వైరల్ వీడియోలు
Latest Videos