Hair Cutting: ఈ రోజుల్లో హెయిర్ కట్ చేసుకుంటే ఆయుష్షు తగ్గుతుందట.. ఈసారి జాగ్రత్త

విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిథుల్లో... కటింగ్, షేవింగ్ చేయించుకోవడం మంచిదట. ఇక ఏయే రోజుల్లో కటింగ్ చేయించుకుంటే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం పదండి....

Hair Cutting: ఈ రోజుల్లో హెయిర్ కట్ చేసుకుంటే ఆయుష్షు తగ్గుతుందట.. ఈసారి జాగ్రత్త
Hair Cutting (Representative image)
Follow us

|

Updated on: Jul 11, 2024 | 8:58 PM

మన దేశంలో వివిధ ప్రాంతాల్లో.. వివిధ ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. మన పెద్దలు ఏది చెప్పినా అందులో నిగూడమైన అర్థం ఏదో ఒకటి ఉంటుంది. మంగళవారం జుట్టు, గోర్లు కట్ చేసుకోకూడదని నానమ్మ-తాతయ్యలు చెబుతుంటారు. అలానే పొద్దు కూకాక కూడా గోర్లు కట్ చేసుకోకూడదని చెబుతుంటారు. పూర్వకాలంలో.. జుత్తు, గోర్లు కత్తిరించుకోవాలంటే.. తేదీ, తిథి, సమయం ఇవన్నీ చూసేవారు. ఇప్పడంటే ఈ విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రోజుల్లో జుత్తు, గోర్లు కట్ చేసుకోవాలో ఇప్పుడు తెలసుకుందాం…

పండితులు చెబుతున్న వివరాలు ప్రకారం… ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు హెయిర్ కటింగ్ పూర్తి చేసుకోవాలి. అప్పుడే శుభం జరుగుతుందట. అంతేకాకుండా తండ్రి, కొడుకులు… అన్నదమ్ములు కూడా ఒకేరోజు జుత్తు కత్తిరించకూడదనే నియమం ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అస్సలు జుత్తు కత్తిరించుకోకూడదట.

సోమవారం..

సోమవారం నాడు కటింగ్ చేయించుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయట. సంపద, శ్రేయస్సు కూడా వృద్ధి చెందటమే కాకుండా.. ఏడు నెలల ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. ఒక కుమారుడ్ని కలిగి ఉన్నవారు.. సంతాన  కోసం ఎదురుచూస్తున్నవారు సోమవారం నాడు హెయిర్ కట్, షేవింగ్ చేయించుకుంటే మంచిదట

మంగళవారం.. ఇక మంగళవారం అస్సలు క్షౌరశాలలే ఉండవు. ఎందుకంటే ఈ రోజు క్షవరం చేయించుకుంటే 8  నెలల ఆయుష్షు తగ్గుతుందట. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో పాటు.. ఇంట్లో ప్రతికూలతలు ఎదురవుతాయట

బుధవారం.. బుధవారం నాడు క్షవరం చేయించుకుంటే.. 5 నెలల ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉండటంతో పాటు… ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

గురువారం.. గురువారం కటింగ్ చేయించుకుంటే..  చేసుకుంటే 10 నెలల ఆయుష్షు పెరుగుతుందట. లక్ష్మీదేవి కృప ఉండాలంటే ఈ రోజున షేవింగ్, కటింగ్ చేయించుకోకూడదు. సంతానం నుంచి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందట..

శుక్రవారం.. శుక్రవారం నాడు క్షవరం చేయించుకుంటే.. 11 నెలలో ఆయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు. సిస్టర్స్ ఉంటే.. శుక్రవారం కటింగ్ చేయించుకోకపోవడం మంచిదట.

శనివారం.. శనివారం నాడు క్షవరం లేదా షేవింగ్ చేయించుకునే వారికి 7 నెలల ఆయుష్షు తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయట

ఆదివారం..ఆదివారం సెలవు రోజు. అందునా.. ఆ రోజు శ్రీమన్నారాయణుడికి అంకితం కాబట్టి  కటింగ్, షేవింగ్, గోర్లు కట్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఇలా చేయడం వల్ల ఓ నెల ఆయుష్షు పెరుగుతుందట.

(ఇది కేవలం కొందరు పండితులు నుంచి సేకరించిన సమాచారం. మూఢనమ్మకాలను ప్రచారం చేయడం టీవీ9 ఉద్దేశం కాదు)

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..