Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోళ్లను మింగిన కొండచిలువ.. రెండేళ్ల తర్వాత రైతుకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం..

తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు తగిన నష్టపరిహారం మంజూరైంది.

కోళ్లను మింగిన కొండచిలువ.. రెండేళ్ల తర్వాత రైతుకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం..
Python Swallows Hens
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2024 | 5:13 PM

ఇంటికి సమీపంలోనే చిన్న కోళ్ల ఫామ్‌ నడుపుకుంటున్న రైతు వద్ద కోళ్లు కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అతనికి నష్టపరిహారం అందిచాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన కెవి జార్జ్ అనే పౌల్ట్రీ రైతు.. గత కొద్ది రోజులుగా తన ఫామ్‌లో వరుసగా కోళ్ల సంఖ్య తగ్గిపోతూ రావటంతో ఆందోళనకు గురయ్యాడు. కోళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారని మొదట్లో అనుమానించాడు. కానీ, 2022 జూన్‌లో ఓ రోజు ఆ కోళ్ల దొంగను గుర్తించాడు. అది ఎవరో తెలిసి నివ్వెరపోయాడు.. కోళ్లను ఎత్తుకెళ్తున్న దొంగ కొండచిలువ అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.

సమాచారం మేరకు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించి తీసుకెళ్లారు. ఆ తరువాత ఇలాంటి అరుదైన సరీసృపాలు రాష్ట్ర రక్షణలో ఉన్నందున.. దీనిని పట్టించి ఇచ్చినందుకు గానూ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ అధికారులు జార్జ్‌కు చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం ఇలాంటి కొండచిలువకు అత్యంత రక్షిత హోదా కల్పించబడింది. కాగా, పరిహారం కోసం జార్జ్‌ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. పరిహారం కోసం అతడు నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.

ఎట్టకేలకు స్థానిక మంత్రి ఒకరు నిర్వహించిన జనతా అదాలత్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న జార్జ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి గారి ఎదుట ఎకరువు పెట్టుకున్నాడు. పాము కేరళ ప్రభుత్వానికి చెందినదని, అయితే తాను కోల్పోయిన కోళ్లు తనవేనని చెప్పుకున్నాడు. తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు రూ.2,000 నష్టపరిహారం మంజూరైంది.

ఇవి కూడా చదవండి

సంతోషంగా ఉన్న జార్జ్ చివరకు ఉపశమనం పొందాడు. అతని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించిందని చెప్పాడు. ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తున్న పాముల నుండి తన కోళ్లఫామ్‌ను రక్షించుకోవడానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాత్రి పూట సరిగా నిద్ర పట్టటం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
రాత్రి పూట సరిగా నిద్ర పట్టటం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
ఓటమి ఎరుగని ఆసీస్ త్రిమూర్తుల గర్వాన్ని దించిన బవుమా సేన
ఓటమి ఎరుగని ఆసీస్ త్రిమూర్తుల గర్వాన్ని దించిన బవుమా సేన
ప్రపంచ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రపంచ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
కళింగ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ వరకు.. విశాఖ పూర్తి చరిత్ర ఇదే..
కళింగ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ వరకు.. విశాఖ పూర్తి చరిత్ర ఇదే..
గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్ వీడియో..
గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్ వీడియో..
ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌!
ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్‌!
అద్దెకు తీసుకుని అంత పని చేశారు.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా
అద్దెకు తీసుకుని అంత పని చేశారు.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా
విమాన ప్రమాదంపై నోరుపారేసుకున్న డిప్యూటీ తహశీల్దార్‌‌కు షాక్!
విమాన ప్రమాదంపై నోరుపారేసుకున్న డిప్యూటీ తహశీల్దార్‌‌కు షాక్!
కేజీఎఫ్ రాఖీ భాయ్ స్టైల్‌తో ఆస్ట్రేలియాకు ఇచ్చిపడేసిన బవుమా..
కేజీఎఫ్ రాఖీ భాయ్ స్టైల్‌తో ఆస్ట్రేలియాకు ఇచ్చిపడేసిన బవుమా..
పెళ్లి కూతురికి కట్నంగా 100 పునుగు పిల్లులు ఇచ్చిన తండ్రి..! అసలు
పెళ్లి కూతురికి కట్నంగా 100 పునుగు పిల్లులు ఇచ్చిన తండ్రి..! అసలు