Viral Video: నాగు పాముకు ఊహించని షాక్ ఇచ్చిన చిట్టి తాబేలు.. వీడియో వైరల్..

నాగు పాము ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి కాటు వేసిదంటే.. పర లోకాలకు గేట్లు తీసేసినట్లే. నాగు పాము ఒక్కసారి పగ పట్టిందంటే.. ఆ మనిషి మరణించే వరకూ వదలదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి నాగు పాముకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ చిట్టి తాబేలు. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా పాముకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్..

Viral Video: నాగు పాముకు ఊహించని షాక్ ఇచ్చిన చిట్టి తాబేలు.. వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Jul 11, 2024 | 5:04 PM

నాగు పాము ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి కాటు వేసిదంటే.. పర లోకాలకు గేట్లు తీసేసినట్లే. నాగు పాము ఒక్కసారి పగ పట్టిందంటే.. ఆ మనిషి మరణించే వరకూ వదలదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి నాగు పాముకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ చిట్టి తాబేలు. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా పాముకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. ఎందుకంటే విష జంతువు. కొన్ని వీడియోల్లో పాము కాటు వేయడం చూసి ఉంటారు. మరికొన్ని వీడియోలకు పాముకు చుక్కలు చూపించిన కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది.

తాబేలు చాలా తెలివైనదని అందరికీ తెలుసు. తాబేలు సాధు జంతువు. చాలా మంది ఇళ్లలో తాబేలును పెంచుకుంటూ ఉంటారు. తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఈ విషయం అటు ఉంచితే.. పాము, తాబేలు ఎదురు పడటం చాలా అరుదు. అనుకోకుండానే ఇవి ఎదురు పడ్డాయి. పాముకు ఎదురు వెళ్లే ధైర్యం ఎవరూ చేయరు. కానీ తాబేలు నాకేంటిలే అనుకుంటూ దాని దారిన అది వెళ్తూ ఉంది.

మరి ఇగోయిస్టిక్ అయిన పాము ఊరుకుంటుందా.. బుస్ బుస్ మని సైగ చేసింది. అయినా తాబేలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. దీంతో పాము ఓ కాటు వేసింది. దీంతో అలర్ట్ అయిన తాబేలు.. చాకచక్యంగా ప్రవర్తించి తన శరీరాన్ని డిప్పలోకి తీసుకుంది. దీంతో పాము కాటు తప్పించుకుంది. తాబేలు డిప్ప చాలా స్ట్రాంగ్ అని అందరికీ తెలిసిందే. రాయి పెట్టి కొట్టినా తాబేలు డిప్ప విరగదు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)