AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jowar Roti : ఆరోగ్యాన్ని పెంచే జొన్న రొట్టె.. ఇలా తయారు చేస్తే విరగదు, గట్టిపడదు..ఇలాంటి రోగాలన్నీ పరార్..!

జొన్న రోటీ కాల్చడానికి కొంత సమయం పడుతుంది. త్వర త్వరగా కాలిస్తే..రంగు వస్తుంది. కానీ, లోపలి భాగం ఉడకదు. కాబట్టి నెమ్మదిగా ఉడికించాలి. సరిగ్గా కాల్చుకుంటే.. ఈ రోటీ మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని హాట్‌ప్యాక్‌లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే జొన్న రోటీ ఎక్కువ సమయం పాటు మెత్తగా ఉంటుంది.

Jowar Roti : ఆరోగ్యాన్ని పెంచే జొన్న రొట్టె.. ఇలా తయారు చేస్తే విరగదు, గట్టిపడదు..ఇలాంటి రోగాలన్నీ పరార్..!
Jowar Roti
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2024 | 6:26 PM

Share

రోటీ విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది గోధుమ పిండి. గోధుమ పిండితో చపాతీలు ఎలా తయారు చేస్తారో మనందరికీ తెలుసు. చపాతీలు మెత్తగా, మృదువుగా ఉండేందుకు రకరకాల టిప్స్‌ పాటిస్తుంటారు చాలా మంది. అయితే మిల్లెట్ రోటీని గోధుమ రొట్టెలా చేస్తారా అని ఎవరైనా అడిగితే.. మీరు కాసేపు మౌనంగా ఉంటారు. నిజానికి, మనం చేసే జొన్న రొట్టెలు, మిల్లెట్‌ చపాతీలు లావుగా ఉంటాయి. చల్లబడినప్పుడు అవి గట్టిపడి విరిగిపోతుంటాయి. అయితే ఈరోజు మేము మీకు ఒక చిట్కా చెప్పబోతున్నాం. ఇది పాటిస్తే.. జొన్న రోటీ కూడా గోధుమ రోటీలా మెత్తగా ఉంటుంది.

జొన్న రొట్టెలు తయారు చేసుందుకు కావాల్సిన పదార్థాలు..

జొన్న పిండి – ఒక కప్పు

ఇవి కూడా చదవండి

వేడినీరు – ఒక కప్పు

రుచికి సరిపడా ఉప్పు

తయారు చేయు విధానం..

– ముందుగా ఒక కప్పు నీటిలో కొంచెం ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు ఆ నీటిని వేడి చేయండి. నీరు మరిగే వరకు వేడి చేయాలి. నీరు మరిగిన తర్వాత అందులో ఒక కప్పు జొన్న పిండి వేయాలి. నీరు ఉన్నంత పిండి వేయాలని గుర్తుంచుకోండి. మీ ఎంపిక ప్రకారం మీరు పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. వేడి నీటిలో పిండిని బాగా కలపండి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి వేడెక్కుతుంది. మెత్తగా నాని ఉబ్బుతుంది.

పిండి నానిన తర్వాత మీ చేతులకు నీటిని రాసుకోండి. ఇప్పుడు పిండిని బాగా కలిపి మెత్తగా చేసుకోవాలి. జొన్న పిండిలో గమ్ ఉండదని గుర్తుంచుకోండి. అందుచేత పిండిని ఎంత ఎక్కువగా పిసికితే అంత జిగురు ఏర్పడుతుంది. ఇలా పిండిని ఎక్కువ జిగటగా కలపటం వల్ల రోటీ మెత్తగా మారడమే కాకుండా పగిలిపోకుండా ఉంటుంది. కావాలంటే, మీరు ఐదు నిమిషాల పాటుగా పిండిని పిసికి కలుపుకోవచ్చు.

పిండిని కావాల్సిన విధంగా పిసికిన తర్వాత కావాల్సిన సైజులో చేతితో రోటీలు వత్తుకోవాలి. ఆ తర్వాత వేడి పాన్ మీద వేసి కాల్చుకోవాలి. 30 సెకన్ల పాటు వేడి చేసిన తరువాత.. దానిపై కొన్ని నీళ్లు చల్లుకోవాలి. 30 సెకన్ల తర్వాత, రోటీని తిరగేసి కాల్చుకోవాలి. తక్కువ మంట మీద బాగా కాల్చుకోవాలి.

జొన్న రోటీ కాల్చడానికి కొంత సమయం పడుతుంది. త్వర త్వరగా కాలిస్తే..రంగు వస్తుంది. కానీ, లోపలి భాగం ఉడకదు. కాబట్టి నెమ్మదిగా ఉడికించాలి. సరిగ్గా కాల్చుకుంటే.. ఈ రోటీ మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని హాట్‌ప్యాక్‌లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే జొన్న రోటీ ఎక్కువ సమయం పాటు మెత్తగా ఉంటుంది.

జొన్నరోటీతో ఆరోగ్య ప్రయోజనాలు..

– బరువు తగ్గాలనుకునే వారు జొన్న రోటీని తినాలి.

– రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, వారికి జొన్న రోటీలు, జావ వంటివి తయారు చేసుకుని తింటే మంచిది.

– జొన్నలో ఉండే విటమిన్ బి, బి3 మనల్ని దృఢంగా చేస్తాయి.

– జొన్న రోటీ మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది.

– జొన్న రోటీ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

– జొన్నలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..