బరువుతగ్గాలనే మోజుతో అస్తిపంజరంగా మారిన యువతి.. గాలివేస్తే ఎగిరిపోవడం ఖాయం.. బరువు ఎంతో తెలిస్తే షాక్..

తప్పుడు ఆహారపు అలవాట్లు అంటే అధిక మొత్తంలో కొవ్వు, కేలరీలు ఉన్న ఆహార పదార్థాలను తిన్నప్పుడు, శారీరక శ్రమ చేయనప్పుడు బరువు పెరుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించుకోవడమే నేటి ప్రజలకు అతిపెద్ద సవాలు. అయితే కొన్నిసార్లు బరువు తగ్గడానికి కొంత మంది తీవ్ర స్థాయి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు ఉండాల్సిన బరువు కంటే అతి తక్కువ బరువు చేరుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం చైనా నుంచి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరీర బరువు చర్చనీయాంశమైంది.

బరువుతగ్గాలనే మోజుతో అస్తిపంజరంగా మారిన యువతి.. గాలివేస్తే ఎగిరిపోవడం ఖాయం.. బరువు ఎంతో తెలిస్తే షాక్..
25kgs Woman Baby TinziImage Credit source: Social Media
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2024 | 8:57 AM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉప్పుడు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇలా శరీర బరువు పెరగడానికి చాలా కారణాలున్నాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు అంటే అధిక మొత్తంలో కొవ్వు, కేలరీలు ఉన్న ఆహార పదార్థాలను తిన్నప్పుడు, శారీరక శ్రమ చేయనప్పుడు బరువు పెరుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించుకోవడమే నేటి ప్రజలకు అతిపెద్ద సవాలు. అయితే కొన్నిసార్లు బరువు తగ్గడానికి కొంత మంది తీవ్ర స్థాయి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు ఉండాల్సిన బరువు కంటే అతి తక్కువ బరువు చేరుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం చైనా నుంచి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరీర బరువు చర్చనీయాంశమైంది.

ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. బేబీ టింగ్జీ అనే అమ్మాయి సన్నబడాలనే క్రేజ్‌తో తన బరువు విపరీతంగా తగ్గించుకుంది. ఎంతగా అంటే ఆ యువతి ఇప్పుడు కేవలం 25 కిలోలు మాత్రమే. అయితే ఇప్పుడు యువతి పరిస్థితి ఎలా ఉందంటే.. ఆమె నడిస్తే ఎక్కడైనా పడిపోతుందేమో లేదా ఆమె ఎముకలు విరిగిపోతాయో అని భయపడేటంతగా.. ఆ యువతి నడుస్తుంటే అస్థిపంజరం నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అనుకోకుండా బలమైన గాలి వీస్తే కిందపడే పరిస్థితి నెలకొంది.

శరీరంలో మాంసమే లేదా?

ఇవి కూడా చదవండి

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో నివసిస్తున్న ఈ బేబీ టింగ్జీ ఎత్తు 160 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల 2 అంగుళాలు. ఆమె బరువు 25 కిలోగ్రాములు మాత్రమే. ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో 42 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. బేబీ టింగ్జీ కోల్పోయిన బరువుని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. బేబీ టింగ్జీ సోషల్ మీడియాలో డ్యాన్స్ చేసిన వీడియోలు, ఫ్యాన్సీ దుస్తులను ధరించడం వంటివి పోస్ట్ చేస్తుంది. అయితే ప్రజల దృష్టి బేబీ టింగ్జీ సన్నని శరీరంపై మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ నడుము సాధారణమైనది కాదు.

బేబీ టిన్జీని చూస్తే ఆమె చేతులు కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయనని అసలు ఆమె శరీరంలో మాంసం లేదనే విషయం చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ బేబీ టింగ్జీ తన బరువును మరింత తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఇలా చేస్తే అనోరెక్సియా అంటే తీవ్ర పోషకాహార లోపం బారిన పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే బేబీ టింగ్జీ వీడియోలను చూసిన నెటిజన్లు కూడా ఆమెను బరువును పెంచుకోమని సలహా ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..