AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima: గురు పౌర్ణమి ఎప్పుడు? జూలై 20నా లేక 21నా ? చంద్రోదయ సమయం ఎప్పుడు? పూజ, దానం ఎప్పుడు చేయాలంటే?

గురు పూర్ణిమ రోజున ఉపవాసం ఉంటారు. నదీ స్నానమాచరించి దానాలు చేసి సత్యనారాయణుడిని పూజిస్తారు. పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకుని మర్నాడు నది స్నానం, దానం చేస్తారు. పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం.

Guru Purnima: గురు పౌర్ణమి ఎప్పుడు? జూలై 20నా లేక 21నా ? చంద్రోదయ సమయం ఎప్పుడు? పూజ, దానం ఎప్పుడు చేయాలంటే?
Ashadha Purnima
Surya Kala
|

Updated on: Jul 13, 2024 | 6:32 AM

Share

హిందూ మతంలో ప్రతి తిధికి ఒకొక్క విశిష్ట సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి గా జరుపుకుంటారు. హిందూ గ్రంధాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహా విష్ణుమూర్తిని, లక్ష్మి దేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది. పౌర్ణమి రోజు స్నానం, దానధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం..

గురు పూర్ణిమ రోజున ఉపవాసం ఉంటారు. నదీ స్నానమాచరించి దానాలు చేసి సత్యనారాయణుడిని పూజిస్తారు. పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకుని మర్నాడు నది స్నానం, దానం చేస్తారు. పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం.

గురు పౌర్ణమి 2024 ఎప్పుడంటే

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ జూలై 20 శనివారం సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలోఈ పౌర్ణమి తిధి ఆదివారం జూలై 21 మధ్యాహ్నం 3:46 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుని జూలై 21న గురు పౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గురు పౌర్ణమి తిధిలో చంద్రోదయ సమయం 2024

జూలై 21న చంద్రోదయ సమయం సాయంత్రం 6.47కి. ఈ సమయంలో చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించి.. నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. వేదమంత్రాలు జపించాలి.

గురు పౌర్ణమి స్నానం, దానం శుభ సమయం 2024

ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై 20న నిర్వహించుకోవాలి. అంటే చాలా మంది సత్యనారాయస్వామి వ్రతం గురు పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అటువంటి వారు కూడా జూలై 20 న జరుపుకోవల్సి ఉంటుంది. జూలై 21 స్నానం , దానధర్మాలకు అనుకూలమైనది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయం 5.37 నుండి స్నానం చేసి శక్తి మేరకు దానం చేయవచ్చు.

సర్వార్థ సిద్ధి యోగం: ఇది జూలై 21 ఉదయం 5:37 నుంచి మర్నాడు అంటే జూలై 22 ఉదయం 12:14 వరకు ఉంటుంది. పూజకు అనుకూలమైన సమయం: జూలై 21 ఉదయం 7.19 నుండి మధ్యాహ్నం 12.27 వరకు ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు