పసుపు దంతాలతో నవ్వాలంటే ఇబ్బంది పడుతున్నారా.. సహజంగానే తెల్లగా మారేలా ఈ పండ్లు తినే ఆహారంలో చేర్చుకోండి
పసుపు రంగు దంతాలను శుభ్రం చేసుకోవడానికి కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వంటింటి నివారణ చిట్కాలను పాటిస్తారు. అటువంటి పరిస్తితిలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా దంతాలను శుభ్రం చేసుకోవాలి. లేదా పసుపు రంగు దంతాలను సహజంగా తెల్లగా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే.. దంతాల మీద ఒక్క మరక కూడా కనిపించకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యంతో పాటు దంతాలను తెల్లగా మార్చడంలో సహాయ పడతాయి.
తెల్లని శుభ్రమైన దంతాలు చిరునవ్వుని మరింత అందంగా చూపిస్తాయి. అయితే చాలామంది దంతాలు పసుపు రంగులోకి గారపట్టినట్లు మారడంతో ఇబ్బంది పడతారు. నలుగురిలో నవ్వాలన్నా ఆలోచిస్తారు. దీంతో పసుపు రంగు దంతాలను శుభ్రం చేసుకోవడానికి కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వంటింటి నివారణ చిట్కాలను పాటిస్తారు. అటువంటి పరిస్తితిలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా దంతాలను శుభ్రం చేసుకోవాలి. లేదా పసుపు రంగు దంతాలను సహజంగా తెల్లగాఈ శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే.. దంతాల మీద ఒక్క మరక కూడా కనిపించకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యంతో పాటు దంతాలను తెల్లగా మార్చడంలో సహాయ పడతాయి.
పసుపు రంగుని తొలగించే పండ్లు
- దంతాల పసుపు రంగుని పోగొట్టుకోవాలంటే రోజు తినే ఆహారమలో పుచ్చకాయ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, అనాస పండుని చేర్చుకోండి. ఈ పండ్లలో బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేసే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలపై పేరుకున్న మరకలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
- స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్లు లాలా జలాన్ని పెంచుతాయి. దీని కారణంగా దంతాల చుట్టూ పేరుకున్న కణాలు, బ్యాక్టీరియా సులభంగా తొలగించబడుతుంది.
- అనాస పండు కూడా దంతాల మీద పసుపుని తొలగించడంలో సహాయపడే అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఆనాస పండులో పపైన్, బ్రోమెలైన్ ఎంజైమ్ లున్నాయి.
- ఈ ఎంజైమ్ లు దంతాల మీద ఉన్న పసుపు మరకలను తొలగించడానికి సహాయ పడతాయి. దీంతో దంతాలు శుభ్రంగా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి.
- దంతాల మీద పసుపు రంగుని పోగొట్టుకోవడానికి ఈ పండ్లను తినడంతో పాటు కొన్ని పనులను కూడా చేయాలి. దంతాల రంగుని మార్చే ఆహారానికి, పానీయాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
- టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలతో పాటు వైన్ ఇలాంటివి దంతాల రంగుని మారుస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)