Belly Fat: భారత్‌పై బెల్లీ ఫ్యాట్ బాంబు… పేలడానికి సిద్ధంగా ఉందా..?
ఉరుకుల పరుగుల జీవితంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఆహారపు అలవాట్లు మనిషి శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య పెరుగుతోంది. జీర్ణ ప్రక్రియలో మార్పుల కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుండటం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రతి మనిషి అందంగా.. ఆరోగ్యంగా కనిపించాలనుకుంటారు. పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి మనిషి రూపురేఖలనే మార్చేస్తున్నాయి. నలుగురిలో కనిపించాలన్నా.. నచ్చిన దుస్తులు వేసుకోవాలన్న ఇబ్బందులు పడాల్సిందే..! ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటే చాలా వరకు అనారోగ్య సమస్యలు తలెత్తవు. కానీ కొంతమందికి తినడం వల్ల పొట్ట వస్తే.. మరికొంత మందికి తినకపోయినా లావుగా తయారు అవుతారు. యాంత్రిక జీవతంలో శరీరక శ్రమ లేకపోవడంతో స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ (పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడం) వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలోనూ బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదురవుతోంది. బెల్లీ ఫ్యాట్‌పై జరిపిన అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఆహారపు అలవాట్లు మనిషి శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య పెరుగుతోంది. జీర్ణ ప్రక్రియలో మార్పుల కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుండటం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉన్న సమస్య. ఎక్కువసేపు కూర్చొవడం, సరైన వ్యాయామం లేకపోవడం ఈ సమస్యకు కారణమవుతోంది. దీనికితోడు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ తినడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన పొట్ట చుట్టూ కొవ్వు కొండలా పేరుకుపోతోంది. మనిషి ఆరోగ్యానికి ఇది తీవ్ర ఆటంకం...