Badrinath: బద్రినాథ్ హైవే పై విరిగిపడుతున్న కొండచరియలు.. రహదారి మూసివేత.. కాలినడకన దాటేందుకు ప్రయాణీకులు యత్నం..

బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వెళ్లిన భక్తులు మూడ్రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై కొండచరియలు తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో.. త్వరలోనే రోడ్ క్లియర్ చేసి.. భక్తులకు రవాణా సదుపాయం కల్పించనున్నారు. చార్‌ధామ్ యాత్రలో నరకం చూస్తున్నారు భక్తులు. ఉత్తరాఖండ్‌ జోషిమఠ్‌లోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో.. మూడ్రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు యాత్రికులు.

Badrinath: బద్రినాథ్ హైవే పై విరిగిపడుతున్న కొండచరియలు.. రహదారి మూసివేత.. కాలినడకన దాటేందుకు ప్రయాణీకులు యత్నం..
Badrinath Highway Closed
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2024 | 8:47 AM

ఋతుపవన వర్షాలు వేసవి నుంచి ఉపశమనం కలిగించడమే కాదు.. కొన్ని ప్రాంతాల్లో విపత్తుని కూడా కలిగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా చార్ ధామ్ యాత్రకు వెళ్ళిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బద్రినాథ్ హైవే పై నిరంతరం కొండ చరియలు విరిగిపడడంతో రహదారిని మూసివేశారు. దీంతో యుపీ, బీహార్, ధిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కాలినడకన రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వెళ్లిన భక్తులు మూడ్రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై కొండచరియలు తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో.. త్వరలోనే రోడ్ క్లియర్ చేసి.. భక్తులకు రవాణా సదుపాయం కల్పించనున్నారు.

చార్‌ధామ్ యాత్రలో నరకం చూస్తున్నారు భక్తులు. ఉత్తరాఖండ్‌ జోషిమఠ్‌లోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో.. మూడ్రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు యాత్రికులు. శిథిలాల కారణంగా హైవేను క్లోజ్ చేయడంతో.. మూడు వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా.. బద్రీనాథ్ నుండి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరగడంతో.. వందలాది మంది యాత్రికులు గురుద్వారాలలో తలదాచుకున్నారు. పర్వత శిథిలాలను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. జోషిమఠ్‌-బద్రీనాథ్‌ హైవేపై పెద్ద రాయి రోడ్డుకు అడ్డుగా పడి ఉంది. రాయిని బ్లాస్టింగ్‌తో పగలగొట్టారు.

ఇవి కూడా చదవండి

కొండచరియలు తొలగించి యాత్రికులకు రోడ్ క్లియర్ చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హైవేపై చెత్తాచెదారం కారణంగా శిథిలాలను తొలగించి ప్రత్యామ్నాయ రహదారిని రెడీ చేస్తున్నారు. భారీ ప్రొక్లెయినర్లను తీసుకొచ్చి.. ప్రత్యామ్నాయ రోడ్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. హైవే క్లోజ్ చేయడంతో సిక్కు తీర్థయాత్ర హేమకుండ్ సాహిబ్ మొదటి స్టాప్ అయిన గోవింద్ ఘాట్‌లోని గురుద్వారాలో రెండు వేల మందికి పైగా యాత్రికులు బస చేస్తున్నారు. ఇందులో వేయి మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్నారు. హేమకుండ్ నుంచి తిరిగి వచ్చిన 550మంది, బద్రీనాథ్ నుండి తిరిగి వచ్చిన 150 మంది సహా 700 మందికి పైగా యాత్రికులు జోషిమఠ్ గురుద్వారా దగ్గర బస చేస్తున్నారు. జోషిమఠ్‌లో 500కు పైగా చిన్న, పెద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కనీసం.. టూవీలర్స్ అయినా వెళ్లేలా దారి క్లియర్ చేసే పనిలో పడింది ఆర్మీ.

చార్‌ధామ్ యాత్రలో భాగంగా… బద్రీనాథ్‌ సందర్శనకు భారీగా తరలివచ్చారు భక్తులు. మూడ్రోజులుగా హైవే క్లోజ్ కావడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.