Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. పిడుగు పడి ఒక్క రోజే 38మంది మృతి.. మరో 5 రోజులు భారీ వర్షాలని హెచ్చరిక

ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఒక్కరోజే 38 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అత్యధికంగా ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారని యూపీ అధికారులు తెలిపారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగరాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి , సిద్ధార్థనగర్‌లలో ఒక్కరు  మరణించారు. అంతేకాదు ఈ జిల్లాల్లో పిడుగుపాటుతో అనేకమంది గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు.

Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. పిడుగు పడి ఒక్క రోజే 38మంది మృతి.. మరో 5 రోజులు భారీ వర్షాలని హెచ్చరిక
Lightning Strikes In Up
Follow us

|

Updated on: Jul 12, 2024 | 7:04 AM

గతకొన్నిరోజులుగా భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది.  వర్షాలు, వరదలతో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తారాఖండ్  సహా ఈశాన్య భారత రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అంతేకాదు మరోవైపు  భారీ వర్షాలతో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఒక్కరోజే 38 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అత్యధికంగా ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారని యూపీ అధికారులు తెలిపారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగరాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి , సిద్ధార్థనగర్‌లలో ఒక్కరు  మరణించారు. అంతేకాదు ఈ జిల్లాల్లో పిడుగుపాటుతో అనేకమంది గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు.

ప్రతాప్‌గఢ్‌లో  ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. వీరి మృతదేహాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం పంపారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 13 నుండి 15 సంవత్సరాల మధ్య వయసుగలవారే ఉన్నారు. పొలాల్లో పనిచేస్తూ కొందరు.. చెట్టు కింద తలదాచుకునే సమయంలో మరికొందరు మృతి చెందడంతో యూపీలోని ఆయా జిల్లాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే రానున్న ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్  సహా పరిసర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరింత విస్తృతంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..