AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్‌!

దేశ వ్యాప్తంగా సంచలనం రేసిన నీట్‌ యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అనుమానితుడు రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ రాకీ అనే వ్యక్తిని పట్నాలో గురువారం మధ్నాహ్నం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బీహార్‌లోని పట్నాలో రెండు చోట్ల, కోల్‌కతాలోని మరికొన్ని ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించాయి...

NEET UG Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్‌!
NEET UG Paper Leak Case
Srilakshmi C
|

Updated on: Jul 12, 2024 | 7:03 AM

Share

న్యూఢిల్లీ, జులై 12: దేశ వ్యాప్తంగా సంచలనం రేసిన నీట్‌ యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అనుమానితుడు రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ రాకీ అనే వ్యక్తిని పట్నాలో గురువారం మధ్నాహ్నం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బీహార్‌లోని పట్నాలో రెండు చోట్ల, కోల్‌కతాలోని మరికొన్ని ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని విచారించేందుకుగాను స్థానిక కోర్టు 10 రోజుల పాటు సీబీఐ కస్టడీ విధించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 12 మందికి దాటింది. దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్ రాకెట్‌పై దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రథమ సమాచార నివేదికలో దాఖలు చేసింది. నీట్ పేపర్ లీకేజీకి హజారీబాగ్ స్కూల్‌తో సంబంధాలు ఉన్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి లీకైన పేపర్లు బీహార్‌కు చేరుకున్నాయని ఓ సీబీఐ అధికారి తెలిపారు.

పేపర్‌ లీకైన క్రమాన్ని వివరిస్తూ… మే 5న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన తొమ్మిది సెట్ల పేపర్లు భద్రపరిచేందుకు రెండు రోజుల ముందుగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు నీట్‌ యూపీ క్వశ్చన్ పేపర్లు చేరుకున్నాయి. అక్కడి నుంచి పరీక్ష కేంద్రంగా ఉన్న హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌కు రెండు సెట్‌లను తరలించారు. పాఠశాలకు చేరుకునేలోపు వాటికి వేసి ఉన్న సీల్స్‌ తొలగించి ఉన్నాయి. ప్రశ్న పత్రాలు సీల్ చేయని సమయంలో అక్కడ రాకీ ఉన్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. అతను ప్రశ్నలను ఫోటోలు తీసి వాటికి సమాధానాలు గుర్తించే ముఠాకు చేరవేశాడు. పేపర్‌కు సమాధానాలు గుర్తించిన తర్వాత నీట్ అభ్యర్ధులతో బేరసారాలు చేసి, లక్షల్లో దోచుకున్నారు. రెండు దశాబ్దాలుగా పేపర్‌ స్కామ్‌లో పరారీలో ఉన్న ఈ రాకెట్‌లోని మరో కీలక వ్యక్తి సంజీవ్ ముఖియాతో కూడా రాకీ టచ్‌లో ఉన్నాడు. విచారణలో ప్రశ్నాపత్రం ఎందరికి చేరింది అనే విషయం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ రెండూ చోట్ల పేపర్‌ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే పేపర్లు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో స్పష్టంగా తెలియనప్పటికీ, బ్యాంకు బ్రాంచ్ నుంచి స్కూల్‌ రవాణా చేస్తున్నప్పుడు మార్గం మధ్యలో పేపర్‌ బయటకు వచ్చి ఉంటుందని సీబీఐ వర్గాలు అనుమానిస్తున్నారు.

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత 67 మందికి ఫస్ట్‌ ర్యాంకులు రావడంతో ఒక్కసారిగా దేశమంతా షాక్‌కు గురయ్యారు. వీరిలో ఒకే కోచింగ్ సెంటర్‌లో 720 మార్కులు సాధించిన ఆరుగురికి ఫస్ట్‌ ర్యాంకులు వచ్చాయి. మరోవైపు ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందించారన్న కారణంలో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం వివాదానికి దారి తీసింది. అయితే గ్రేస్‌ మార్కులు ఇచ్చిన వారందరికీ రీటెస్ట్ పెట్టి, కొత్త ర్యాంకులు ప్రకటించినా.. ప్రస్తుతం పేపర్‌ లీక్‌ వ్యవహారం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నీట్‌ పరీక్ష మరోసారి పెట్టాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం.. లీకేజ్‌ స్థానికంగానే ఉందని చెబుతోంది. సోషల్ మీడియాలో పేపర్లు షేర్‌ చేయలేదని పేర్కొంటోంది. మరోవైపు ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను జులై 18కి వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us