AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘పోతార్రా.. ఇలాంటి ‘టీ’ తాగితే నేరుగా పైకి పోతారు’ వీడియో చూసి స్టన్ అవుతున్న నెటిజన్లు

టీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఘుమఘుమలాడే వేడి వేడి టీని ఓ కప్పు తాగితే వచ్చే మజా అంతాఇంతా కాదు. ఇక బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన దుకాణాల్లో సువాసనలు వెదజల్లే టీ తాగి తరిస్తుంటారు కొందరు టీ ప్రేమికులు. అయితే మీరిప్పటి వరకూ.. తేయాకు టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, కోల్డ్‌ టీ, చమోమిలే టీ, మూలికల టీ, మసాలా టీ, ఇరానీ చాయ్, లెమన్‌గ్రాస్ టీ.. చివరికీ తందూరీ టీ గురించి కూడా మీరు వినే ఉంటారు..

Viral Video: 'పోతార్రా.. ఇలాంటి 'టీ' తాగితే నేరుగా పైకి పోతారు' వీడియో చూసి స్టన్ అవుతున్న నెటిజన్లు
Tea Vendor Prepares Chai With Pepsi
Srilakshmi C
|

Updated on: Jul 11, 2024 | 10:50 AM

Share

టీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఘుమఘుమలాడే వేడి వేడి టీని ఓ కప్పు తాగితే వచ్చే మజా అంతాఇంతా కాదు. ఇక బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన దుకాణాల్లో సువాసనలు వెదజల్లే టీ తాగి తరిస్తుంటారు కొందరు టీ ప్రేమికులు. అయితే మీరిప్పటి వరకూ.. తేయాకు టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, కోల్డ్‌ టీ, చమోమిలే టీ, మూలికల టీ, మసాలా టీ, ఇరానీ చాయ్, లెమన్‌గ్రాస్ టీ.. చివరికీ తందూరీ టీ గురించి కూడా మీరు వినే ఉంటారు. కానీ వెరైటీగా పెస్పీతోనో.. కొకొకోలాతోనో ఎప్పుడైనా టీ తయారు చేశారా? పోనీ .. కనీసం తాగారా? మీ సమాధానం ‘నో’ మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే. రోడ్డు పక్కన దర్జాగా టీ దుఖాణం పెట్టిన ఓ వ్యాపారి టీ తయారు చేసిన విధానం చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. అసహ్యంతో వాంతి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకైనా మంచిది టీ ప్రియులకు ఇది కొంచెం భీతి గొలిపే విషయమే. మీరూ చూసేయండి..

ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన దుఖాణంలో టీ తయారు చేయడం కనిపిస్తుంది. ముందుగా ఇంతకు ముందే టీ తయారు చేసిన ఓ పాత్రను ఏ మాత్రం శుభ్రం చేయకుండా.. అలాగే స్టవ్‌పై పెట్టి అందులో పాల ప్యాకెట్స్‌ కట్‌ చేసి పాలు పోయడం కనిపిస్తుంది. ఆ తర్వాత గ్లాసులు కడిగిన నీళ్లు లాంటి ఎంగిలి నీళ్లను పోలిన.. కొన్ని నీళ్లను ఈ పాత్రలో పోస్తాడు. ఈ వెంటనే టీ ఆకు రెండు, మూడు స్పూన్లు వేసేస్తాడు. ఇంతవరకు కాస్త బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సీన్‌ వస్తుంది. చేతిలోకి ఓ పెస్సీ బాటిల్‌ తీసుకుని, దాని మూత తీసి టీ పాత్రలో పెస్సీ మొత్తం ఒలకబోస్తాడు. అనంతరం బాగా మరిగించి పాత్రను గుండ్రంగా ఓ సారి తిప్పేస్తాడు. అంతే టీ తయారై పోయినట్లుంది.. వెంటనే రెండు పేపర్ గ్లాసులు తీసుకుని, ఒడకట్టి టీ గ్లాసుల్లో నింపేస్తాడు. వాటిని తీసుకుని ఎదురుగాఉన్న కస్టమర్లకు సర్వ్‌ చేయడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వింత టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెప్సీతో తయారు చేసిన విచిత్రమైన టీ వీడియోలో ఓ సినిమా ఫన్నీ డైలాగ్‌ను కూడా జోడించేశారు. వీడియో ప్రారంభంలో టీ ప్రియులను ఆకట్టుకునేలా క్యాజువల్‌గా చూపించినా.. ఈ వీడియో క్లిప్‌లోకి కొన్ని సెకన్లు టీ ప్రియుల హృదయాలను ముక్కలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు నవ్వుల ఎమోజీలతో కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.. ‘Thuuuuu (Ewwww)’ అంటూ తమ అయిష్టాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ మీరేం అంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.