Hyderabad: క్షణాల్లో ఆవిరైన కొలువొచ్చిన ఆనందం.. ఆర్టీసీ బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు

బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసి, కొరుకున్న కొలువు సొంతం చేసుకుంది ఆ యువతి. తన కలను నెరవేర్చిన దేవుడిని దర్శించుకుందాని తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు కూడా చెల్లించుకొని తిరిగి వచ్చింది. అయితే ఇంతలోనే విధి అనూహ్య మలుపు తిప్పింది. కొలువు దక్కించుకున్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు..

Hyderabad: క్షణాల్లో ఆవిరైన కొలువొచ్చిన ఆనందం.. ఆర్టీసీ బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు
RTC bus accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2024 | 9:29 AM

ఆసిఫ్‌నగర్, జులై 11: బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసి, కొరుకున్న కొలువు సొంతం చేసుకుంది ఆ యువతి. తన కలను నెరవేర్చిన దేవుడిని దర్శించుకుందాని తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు కూడా చెల్లించుకొని తిరిగి వచ్చింది. అయితే ఇంతలోనే విధి అనూహ్య మలుపు తిప్పింది. కొలువు దక్కించుకున్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాదకర ఘటన హుమాయున్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు రోడ్డులో మంగళవారం రాత్రి (జులై 9) చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదేశ్వర్, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

హిమాయత్‌నగర్‌ అడ్వకేట్‌కాలనీలోని మద్రికా అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్, వాణి అనే దంపతులు నివాం ఉంటున్నారు. వీరి కుమార్తె డి స్రవంతిరాణి (20) ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల ఆరంభంలో జెన్‌ప్యాక్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం రావటంతో ఇంటిల్లిపాది ఆనందంతో తరించిపోయారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి వెళ్లింది. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చింది. తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం ఆసిఫ్‌నగర్‌లో ఉండే మిత్రుడికి ఇచ్చేందుకు అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు యత్నించగా..స్నేహితుడి కుటుంబసభ్యులు ఒంటరిగా వెళ్లొద్దని వారించారు. దీంతో స్నేహితుడి బైక్‌పై బయల్దేరింది స్రవంతిరాణి. అతను వెనక కూర్చోగా, స్రవంతి ముందు కూర్చుని బైక్‌ నడపసాగింది.

అయితే ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు సమీపంలోని కాగానే ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటికి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సిటీ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన రాత్రి 10.22 సమయంలో జరిగింది. ఈ ప్రమాదంతో స్రవంతి బస్సు కింద పడి.. తీవ్రంగా గాయాలపాలైంది. స్థానికులు హుటాహుటీన బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వేగంగా బస్సు నడిపిన డ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుమాయున్‌నగర్‌ ఎస్పై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బైక్‌ వెనుక కూర్చున్న మృతురాలి స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి