AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘అక్కడ ఎలా పెట్టావ్‌ తల్లీ..’ డ్రైవ్‌ చేసుకుంటూ కరెంట్‌ స్తంభంపైకి కారును ఎక్కించిన మహిళ! వీడియో తీసిన జనాలు

రీల్‌ మోజులో పడి గుజరాత్‌లో కొందరు ఆకతాయిలు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఘటన మరువక ముందే తాజాగా మరొక షాకింగ్‌ సీన్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి ఓ కారు ఏకంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఏక్కేసింది. అసాధారణంగా ఎవరో తీసుకెళ్లి స్తంభంపై ఉంచినట్లు నిటారుగా నిలబడి ఉంది. గుజరాత్‌లోని గురుగ్రామ్‌లో సైబర్ సిటీ ప్రాంతంలో గత సోమవారం (జులై 8) ఈ సంఘటన చోట చేసుకుంది..

Viral Video: 'అక్కడ ఎలా పెట్టావ్‌ తల్లీ..' డ్రైవ్‌ చేసుకుంటూ కరెంట్‌ స్తంభంపైకి కారును ఎక్కించిన మహిళ! వీడియో తీసిన జనాలు
Mahindra Thar Climbs Up Electric Pole
Srilakshmi C
|

Updated on: Jul 11, 2024 | 11:26 AM

Share

గురుగ్రాం, జులై 11: రీల్‌ మోజులో పడి గుజరాత్‌లో కొందరు ఆకతాయిలు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఘటన మరువక ముందే తాజాగా మరొక షాకింగ్‌ సీన్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి ఓ కారు ఏకంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఏక్కేసింది. అసాధారణంగా ఎవరో తీసుకెళ్లి స్తంభంపై ఉంచినట్లు నిటారుగా నిలబడి ఉంది. గుజరాత్‌లోని గురుగ్రామ్‌లో సైబర్ సిటీ ప్రాంతంలో గత సోమవారం (జులై 8) ఈ సంఘటన చోట చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారుని మరొక వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో అది రోడ్డు పక్కనే ఉన్న స్తంభంపైకి ఎక్కి కూర్చుంది.

ఆంచల్ గుప్తా అనే మహిళ నడుపుతున్న మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారును మరొక కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గోల్డ్ కోర్స్ రోడ్ ఎక్స్‌టెన్షన్‌లో ఆ రెండు వాహనాలు ఢీకొన్నాయి. తాకిడికి మహిళ తన కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది కాస్తా స్తంభాన్ని ఢీకొని.. అమాంతం పైకి వెళ్లిపోయింది. అదే సమయంలో కారులో ఉన్న మహిళను స్థానికులు తలోచేయి వేయడంతో చాకచక్యంగా కారులో నుంచి బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఆంచల్ గుప్తా మాట్లాడుతూ..’నేను పెట్రోల్‌ పంపు నుంచి కారును డ్రైవ్‌ చేసుకుంటూ బయటికి వస్తుండగా వెనుక నుంచి హోండా అమేజ్‌ కారు ఢీ కొట్టిందని, వెంటనే తన కారును ఎడమ వైపు మళ్లించానని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని’ గుప్తా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కారు కరెంట్ స్తంభంపైకి వెళ్లడంతో పై నుంచి తాను కిందికి దూకేశానని తెలిపింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైనప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక గుప్తా కారును ఢీకొట్టిన హోండా అమేజ్‌ కారులోపల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కారును ఢీ కొట్టిన వెంటనే అక్కడి నుంచి కారుతో సహా ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గురుగ్రామ్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కారు విద్యుత్ స్తంభంపైకి ఎక్కినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.