AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటి బయట కాపలా కాసిన ఇల్లాలు.. ఇంట్లో భర్తను హత్య చేసిన ప్రియుడు!

కొత్తగూడెం పట్టణం గౌతంపూర్‌ కాలనీకి చెందిన అరికె రమేశ్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ఏరియాలో నివాసం ఉంటోన్న సాహు ఈశ్వర్‌కుమార్‌ (38) భార్య ఎండీ రెహనాతో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల క్రితం రెహనా భర్త ఈశ్వర్‌ కుమార్‌కు తెలిసి.. భార్యను నిలదీశాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి..

Telangana: ఇంటి బయట కాపలా కాసిన ఇల్లాలు.. ఇంట్లో భర్తను హత్య చేసిన ప్రియుడు!
Wife Killed Husband
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 11, 2024 | 8:08 PM

Share

కొత్తగూడెం, జులై 11: సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోని అతిథి చిచ్చురాజేశాడు. అతని మాయలో పడిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. హత్యవెనుక దాగిఉన్న విస్తుపోయే నిజాలు పోలీసు విచారణలో ఒక్కొక్కటిగా ఆలస్యంగా బయటికొచ్చాయి. డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

కొత్తగూడెం పట్టణం గౌతంపూర్‌ కాలనీకి చెందిన అరికె రమేశ్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ఏరియాలో నివాసం ఉంటోన్న సాహు ఈశ్వర్‌కుమార్‌ (38) భార్య ఎండీ రెహనాతో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల క్రితం రెహనా భర్త ఈశ్వర్‌ కుమార్‌కు తెలిసి.. భార్యను నిలదీశాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మరోవైపు రమేష్‌ను కూడా ఆ ఏరియా నుంచి తరిమేయాలనుకున్న ఈశ్వర్‌ అతని గురించి ఆరా తీశాడు. అ క్రమంలో రమేష్‌ సింగరేణి క్వార్టర్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుసుకుని, అతన్ని అక్కడ్నుంచి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. కొందరు స్థానికులతో కలిసి సింగరేణి అధికారులకు రమేష్‌పై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు రమేశ్‌ కుటుంబాన్ని క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించారు.

మరోవైపు భర్త ఈశ్వర్‌ కుమార్‌ వేధింపులు తాళలేక రెహనా తన ప్రియుడు రమేశ్‌కు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి ఎలాగైనా ఈశ్వర్‌ అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నారు. అతడితో కలిసి భర్త హత్యకు పథకం పన్నింది. ఈ క్రమంలో జులై 6న ఈశ్వర్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతనిపై రమేశ్, అతడి బంధువు బట్టు చందు కత్తులతో దాడిచేశారు. ఇదే సమయంలో ఎవరూ తమ ఇంటివైపు రాకుండా రెహనా ఇంటిబయట కాపలా కాసింది. గతంలో ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే రమేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులను నమ్మించింది. కత్తిపోట్లకు గురైన ఈశ్వర్‌ను వెంటనే ఖమ్మంలోని ఓ ఆసుపత్రిరి తరలించగా.. అతడు అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై టూటౌన్‌ సీఐ రమేశ్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా హతుడి భార్యపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా మొత్తం కుట్ర బయటపడింది. రెహనాతోపాటు రమేష్, అతడి బంధువును పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.