Budh Gochar 2024: సింహరాశిలో అడుగు పెట్టనున్న బుధుడు.. రానున్న రెండు నెలలు ఈ 6ల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

బుధుడు కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని ఆగస్టు 5వ తేదీ రాత్రి 10:27 గంటలకు ముగించుకుని సింహరాశిలోకి ప్రవేశించి అనేక రాశులపై తన ఆశీర్వాదాలను కురిపించనున్నాడు. వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ , సాంకేతిక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు బుధుడు సంచారంతో ప్రయోజనం పొందుతారు. బుధగ్రహ ప్రభావంతో ఈ ఆరు రాశుల వారికి రానున్న రెండు నెల్లో పట్టిందల్లా బంగారంగా మార్చుకుంటారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Budh Gochar 2024: సింహరాశిలో అడుగు పెట్టనున్న బుధుడు.. రానున్న రెండు నెలలు ఈ 6ల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Budh Gochar 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2024 | 8:28 AM

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. ఈ నవ గ్రహాల్లో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. అంతేకాదు బుధుడు తెలివి, జ్ఞానం, సంపద, ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యానికి బాధ్యత వహించే గ్రహంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే ఎవరి జాతకంలోనైనా బుధుడు స్థానం బలంగా ఉంటే అతని జీవితంలో ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు లోటు ఉండదని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బుధ సంచారము అనేక రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభాలను తెస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బును పొందుతారు. వృత్తి, వ్యాపారంలో కూడా విజయం పొందుతారు. అటువంటి పరిస్థితిలో బుధ సంచారము ఏ రాశుల వారికి అదృష్టమో ఈ రోజు తెలుసుకుందాం..

గ్రహాలన్నీ ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఆగష్టు 5వ తేదీన 2024న బుధుడు గ్రహాలకి అధిపతి సూర్యుని సొంత రాశిలో అంటే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా ఈ స్థితిలో 24 రోజుల పాటు ఉండనున్నాడు. దీని తరువాత బుధుడు కన్యారాశిలోకి అడుగు పెడతాడు. అటువంటి పరిస్థితిలో బుధుడు ఆగస్టు 5 నుండి వచ్చే రెండు నెలల వరకు చాలా మంచి ప్రభావాన్ని చూపించనున్నాడు.

బుధుడు కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని ఆగస్టు 5వ తేదీ రాత్రి 10:27 గంటలకు ముగించుకుని సింహరాశిలోకి ప్రవేశించి అనేక రాశులపై తన ఆశీర్వాదాలను కురిపించనున్నాడు. వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ , సాంకేతిక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు బుధుడు సంచారంతో ప్రయోజనం పొందుతారు. సింహరాశిలో బుధుడు సంచారంతో బుధుడికి ఇష్టమైన మిధునం, సింహ రాశి, కన్య, తుల, మకరం, కుంభరాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. బుధగ్రహ ప్రభావంతో ఈ ఆరు రాశుల వారికి రానున్న రెండు నెల్లో పట్టిందల్లా బంగారంగా మార్చుకుంటారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. మిధునరాశి: బుధ సంచారం మిథున రాశికి చెందిన వ్యక్తుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. శుభవార్త వింటారు. కెరీర్ లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కొందరికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాదు చేసే పర్యటనలు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. మొత్తానికి ఈ రాశికి వారికి బుధుడు సంచారంతో అదృష్టం వీరి సొంతం అవుతుంది.
  2. సింహరాశి: బుధుని సంచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. పెద్ద పదవిని కూడా పొందవచ్చు. దీనితో పాటు శత్రువులపై విజయం సాధిస్తారు. కోరుకున్న పనిలో విజయం సాధించవచ్చు. జీవిత భాగస్వామి మధ్య సంబంధాలు సంతోషంగా సాగాతాయి. విదేశాలకు వెళ్లాలనే కోరికతో ప్రయత్నం చేస్తున్న స్టూడెంట్స్ ప్రయత్నలు నెరవేరే అవకాశం ఉంది.
  3. కన్య రాశి: బుధుడు తన రాశిని మార్చుకోవడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే.. కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో జీవిత భాగస్వామితో మంచి క్షణాలను గడుపుతారు. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
  4. తులారాశి: శుక్రుడు పాలించే తుల రాశి వారికి బుధుడు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడి డబ్బు నుండి లాభాలను పొందుతారు. ఈ కాలంలో అంతవరకూ ఉన్న పనుల్లో అడ్డంకులు తొలగిపోవచ్చు. తుల రాశి విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రేమ, వైవాహిక జీవితంలో మంచి అనుభవాలను పొందుతారు. ప్రేమ వివాహాలకు తలుపులు తెరుచుకుంటాయి. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.
  5. మకరరాశి: గ్రహాల రాకుమారుడైన బుధగ్రహ సంచారం మకర రాశి వారికి చాలా శుభాలను కురిపించబోతోంది. ఈ కాలంలో వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు జీవితంలో చాలా సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగే ఈ సమయంలో కెరీర్ గ్రాఫ్ ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలా పురోగతిని పొందుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
  6. కుంభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధ సంచారము వలన కూడా మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. అయితే కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సంచార సమయంలో శుభ కార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు