Sunita Williams: నాసాలో టెన్షన్ మొదలు.. సునీతా, విల్మోర్‌లను తీసుకుని రావడానికి 18 రోజులు మాత్రమే టైమ్‌

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు... పది రోజుల మిషన్‌లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి..  బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి.

Sunita Williams: నాసాలో టెన్షన్ మొదలు.. సునీతా, విల్మోర్‌లను తీసుకుని రావడానికి 18 రోజులు మాత్రమే టైమ్‌
Sunita Williams' Boeing StarlinerImage Credit source: NASA
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2024 | 7:16 AM

అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసాకు 18 రోజులు మాత్రమే గడువు ఉందా..? ఆ గడువు దాటితే ఏమవుతుంది? నాసాకు టెన్షన్‌ పుట్టిస్తున్న ఈ కౌంట్‌డౌన్‌ వెనుక ఉన్న అసలు కథ, వ్యథ ఏంటి? అసలు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారు? వాళ్లు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారా అన్న ప్రశ్నకు నాసా దగ్గర సమాధానం ఉందా అని అందరిలోనూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాసాకు 18 రోజుల గడువు

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు… పది రోజుల మిషన్‌లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి..  బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీనికితోడు స్పేస్‌ క్రాఫ్ట్‌లోని సర్వీస్‌ మోడ్యుల్‌లో 5 చోట్ల హీలియం గ్యాస్‌ లీక్‌ అవుతోంది. దీంతో సునీతా బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా శతవిధాలా ప్రయత్నిస్తోంది. నాసా టీమ్‌ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరగా మరమ్మతులు చేస్తోంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావట్లేదు. దీంతో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారనేది సస్పెన్స్‌గా మారింది. వాళ్లు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు నాసా నుంచి సమాధానం లేదు.

మరో అంశం తాజాగా తెర పైకి

అయితే కలవర పెట్టే మరో అంశం తాజాగా తెర పైకి వచ్చింది. ఈ స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిస్‌కు మరమ్మతులు పూర్తి చేసి, సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లను భూమి పైకి తీసుకుని వచ్చేందుకు నాసాకు 18 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నాసా వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

ఇవి కూడా చదవండి

వ్యోమగాముల భద్రతకు ప్రమాదం

ఇప్పుడు ఐఎస్‌ఎస్‌కి అనుసంధానమై ఉన్న స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిప్‌…వ్యోమగాములను తిరిగి భూమి పైకి తీసుకుని రావాలంటే, దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. భూ వాతావరణం లోకి వ్యోమ నౌక సురక్షితంగా ప్రవేశించడంలో అవి అత్యంత కీలకం పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికితోడు ఐఎస్ఎస్ డాకింగ్ పోర్ట్ లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే.. రాబోయే క్రూ-9 మిషన్ కు అనుగుణంగా డాకింగ్ పోర్ట్ దగ్గర స్టార్‌లైనర్‌ను అన్‌డాక్ చేయాలి. క్రూ-9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ-9 మిషన్ నలుగురు సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తుంది. అంటే వాళ్లు వెళ్లే లోపలే ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించిన స్టార్‌ లైనర్‌ స్పేష్‌ షిప్‌ను అన్‌డాక్ చేయాల్సి ఉంటుంది. అంటే సునీత, బుచ్‌లను భూమి పైకి తీసుకుని రావాల్సి ఉంటుంది.

 నాసాలో టెన్షన్‌ మొదలు

అయితే ఆ పని ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్‌ లైనర్‌లో వ్యోమగాములు భూమిపై ల్యాండ్‌ కాలేరు. ఒకవేళ ఐఎస్‌ఎస్‌లోనే సునీత ఉండాలనుకుంటే..స్టార్‌ లైనర్‌ని భూమి నుంచి రాబోయే స్పేస్‌ షిప్‌ కోసం అన్‌ డాక్‌ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేరు. దీంతో నాసాకు పెద్ద టెన్షన్‌ మొదలైంది.

సునీతా విలియమ్స్‌కు ఆరోగ్య సమస్యలు

ఇక స్టార్ లైనర్ వ్వోమ నౌక పనికిరాకుండా పోయినట్లయితే.. విలియమ్స్, విల్మోర్ లను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను నాసా అన్వేషించాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించుకోవచ్చు. మరోవైపు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం వల్ల సునీతా విలియమ్స్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడం కూడా నాసాను కలవరపెడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే