Mangala Gauri Vratam: వివాహం ఆలస్యం అవుతోందా.. శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఇలా చేయండి కోరుకున్న వరుడు లభిస్తాడు.

మంగళ గౌరీ వ్రతం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతు ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయి. ఆగష్టు 5వ తేదీ సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభంకానుంది. దీంతో శ్రావణ మొదటి మంగళ గౌరీ వ్రతం ఆగష్టు 6వ తేదీన ఆచరించనున్నారు. ఈ నేపధ్యంలో మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత, పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Mangala Gauri Vratam: వివాహం ఆలస్యం అవుతోందా.. శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఇలా చేయండి కోరుకున్న వరుడు లభిస్తాడు.
Mangala Gauri Vratam
Follow us

|

Updated on: Aug 04, 2024 | 9:08 AM

శ్రావణ మాసంలోని మంగళవారం రోజుని పార్వతీ దేవికి అంకితం చేశారు. వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితంలో సంతోషం, శాంతిని పొందేందుకు శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ దేవి వ్రతాన్ని ఆచరిస్తే, పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతు ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయి. అంతేకాదు త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంటుందని నమ్మకం. అంతేకాదు దంపతుల మధ్య వివాదాలు ఉన్నా.. సంతానం పొందాలనుకునే స్త్రీలకు కూడా ఈ మంగళ గౌరి వ్రతం, ఉపవాసం ముఖ్యమైనది.

శ్రావణ మంగళ గౌరీ వ్రతం

ఆగష్టు 5వ తేదీ సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభంకానుంది. దీంతో శ్రావణ మొదటి మంగళ గౌరీ వ్రతం ఆగష్టు 6వ తేదీన ఆచరించనున్నారు. ఈ నేపధ్యంలో మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత, పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత

వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందేందుకు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. ఈ వ్రతం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా మారుతుంది. అంతే కాకుండా సంతానం సంతోషం కోసం కూడా ఈ వ్రతాన్ని పాటిస్తారు. యువతి తన వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయినా..  ఎవరి జాతకంలోనైనా కుజ దోషం ఉన్నట్లయితే ఆ యువతులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

మంగళ గౌరీ వ్రతం పూజా విధానం

మంగళగౌరీ వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. తరువాత శివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. గౌరీ దేవి ముందు నెయ్యితో దీపం వెలిగించండి. నియమ నిష్టలు, ఆచారాల ప్రకారం ఆదిదంపతులైన శివ పార్వతులను పూజించండి. పూజ సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, మహిళ అలంకరణ వస్తువులను సమర్పించండి. దీనితో పాటు శివునికి ఉమ్మెత్త, బిల్వ పత్రాలు, గంధం, గంగాజలం, పాలు మొదలైన వాటిని సమర్పించి పండ్లు, మిఠాయిలు, ఖీర్ మొదలైన వాటిని సమర్పించండి. ఆ తర్వాత ఆరతి నిర్వహించి మంత్రాలను పఠించండి. ఈ సమయంలో సంతోషకరమైన జీవితం కోసం శివపార్వతులను ప్రార్థించండి.

వివాహం కోసం ఈ మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

“ఓం హ్రీం యోగినీ యోగినీ యోగేశ్వరి యోగ భయంకరీ మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః”

ఓం పార్వతీ పత్యే నమః ఓం పార్వతీ పత్యే నమః .

ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలంటే..

“హే గౌరీ శంకరార్ధాంగి, యధాత్వం శంకరప్రియా తథామాం, కురు కళ్యాణి, కాంత కాంతం సుదుర్లభమ్

వ్రతం చేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఉపవాస సమయంలో పరిశుభ్రత, స్వచ్ఛత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పూజలో అమ్మవారికి కుంకుమ, అక్షతం, పసుపు, తేనె మొదలైన వాటిని సమర్పించండి. పూజ సమయంలో ఓం మంగళాయ నమః మంత్రాన్ని కూడా జపించండి. చివరికి హారతి ఇచ్చే సమయంలో మంగళ గౌరీ దేవి కథను కూడా చదవండి. ఇలా వ్రత కథ వినడం ద్వారా ఉపవాసానికి సంబంధించిన పూర్తి ఫలితాలు పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
IND vs SL: సచిన్-ధోనీల రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్
IND vs SL: సచిన్-ధోనీల రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్
9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 900 కి.మీలు వెళ్లొచ్చు.. సామ్‌సంగ్
9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 900 కి.మీలు వెళ్లొచ్చు.. సామ్‌సంగ్
భ‌ళ్లాల‌దేవుడిగా ఫ‌స్ట్ ఆప్ష‌న్ రానా కాదంటా.. మ‌రి ఎవ‌రినంటే..
భ‌ళ్లాల‌దేవుడిగా ఫ‌స్ట్ ఆప్ష‌న్ రానా కాదంటా.. మ‌రి ఎవ‌రినంటే..
దేశంలో కొనసాగుతున్న వరదల బీభత్సం.. కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
దేశంలో కొనసాగుతున్న వరదల బీభత్సం.. కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
రెండో వన్డేకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ జరగడంపై అనుమానం?
రెండో వన్డేకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ జరగడంపై అనుమానం?
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!