అత్యంత సాహస ఆధ్యాత్మిక యాత్ర కిన్నౌర్ కైలాష్ యాత్ర.. ఎప్పుడు ప్రారంభం? ఇక్కడ వికసించే బ్రహ్మ కమలం ఎవరికి కనిపిస్తుందో తెలుసా..

కిన్నౌర్‌లోని కైలాస పర్వతం హిందూమతంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ పర్వతం ఐదు పవిత్ర పర్వతాలలో ఒకటి. అందుకే కిన్నౌర్ కైలాస పర్వతం చాలా ముఖ్యమైనది. మానసరోవరం, అమర్‌నాథ్ యాత్రల కంటే కిన్నౌర్ కైలాష్ యాత్ర చాలా కష్టమైన యాత్రగా పరిగణించబడుతుంది. కిన్నౌర కైలాష్ పర్వతం శివుని పురాతన నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కిన్నౌర్ కైలాష్ యాత్ర ఏడాదిలో ఒక నెల మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మాత్రమే భక్తులు దర్శనానికి వెళ్లవచ్చు.

అత్యంత సాహస ఆధ్యాత్మిక యాత్ర కిన్నౌర్ కైలాష్ యాత్ర.. ఎప్పుడు ప్రారంభం? ఇక్కడ వికసించే బ్రహ్మ కమలం ఎవరికి కనిపిస్తుందో తెలుసా..
Kinnaur Kailash Yatra 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2024 | 10:04 AM

కిన్నౌర్ కైలాష్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో సముద్ర మట్టానికి 6050 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వతం. మానస సరోవర్, అమర్‌నాథ్ యాత్రల కంటే కిన్నౌర్ కైలాష్ యాత్ర చాలా కష్టమైన యాత్రగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రయాణం గురించి తెలుసుకుందాం.. హిందూ మతంలో ఎవరైనా తమ జీవితంలో ఒకసారైనా ఈ యాత్రను పూర్తి చేసినట్లయితే.. ఆ వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని లేదా భగవంతుని నివాసాన్ని పొందుతాడు. అదే సమయంలో ఈ యాత్ర సమయంలో లభించిన ఫలాలను రానున్న అనేక తరాలు అనుభవిస్తూనే ఉంటారని విశ్వాసం. అటువంటి ఆధ్యాత్మిక యాత్ర కిన్నౌర్ కైలాష్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కిన్నౌర్ కైలాష్ యాత్ర గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.. ఈ సంవత్సరం కిన్నౌర్ కైలాష్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలుసుకుందాం.

కిన్నౌర్ కైలాష్ ఎక్కడ ఉంది?కిన్నౌర్ కైలాష్ యాత్ర అంటే ఏమిటి?

సముద్ర మట్టానికి 6050 మీటర్ల ఎత్తులో ఉన్న కిన్నెర్ కైలాష్ పర్వతం. నిజానికి దీని పేరు కిన్నౌర్ కైలాష్. అయితే దీనిని ఆది కిన్నార్ కైలాష్ అని పిలవబడుతోంది. కిన్నౌర్ కైలాష్ పర్వతంపై ఒక ఐస్ బ్లాక్ ఉంటుంది. ఇది సహజమైన శివలింగం.. అంటే అది స్వయంగా ఉద్భవించింది. కిన్నౌర్ కైలాష్ పర్వతంలోని సహజ శివలింగం పగటి సమయంలో రంగు మారుతూ ఉంటుంది. ఈ శిల 20,000 అడుగుల ఎత్తైన కిన్నౌర్ కైలాష్ శ్రేణిలో కైలాష్ పర్వతం, జోర్కాండెన్ పర్వతాల మధ్య ఉంది.

కిన్నౌర్‌లోని కైలాస పర్వతం హిందూమతంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ పర్వతం ఐదు పవిత్ర పర్వతాలలో ఒకటి. అందుకే కిన్నౌర్ కైలాస పర్వతం చాలా ముఖ్యమైనది. మానసరోవరం, అమర్‌నాథ్ యాత్రల కంటే కిన్నౌర్ కైలాష్ యాత్ర చాలా కష్టమైన యాత్రగా పరిగణించబడుతుంది. కిన్నౌర కైలాష్ పర్వతం శివుని పురాతన నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కిన్నౌర్ కైలాష్ యాత్ర ఏడాదిలో ఒక నెల మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మాత్రమే భక్తులు దర్శనానికి వెళ్లవచ్చు.

ఇవి కూడా చదవండి

కిన్నౌర కైలాష్ పర్వతం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది. మానసరోవరం, అమర్‌నాథ్ యాత్ర కంటే కిన్నౌర్ కైలాష్ ప్రయాణం చాలా కష్టంగా పరిగణించబడుతుంది. ఈ ప్రయాణం ప్రతి సంవత్సరంశ్రావణ మాసంలో ప్రారంభమై ఒక నెల పాటు కొనసాగుతుంది. అదే సమయంలో ఈ ప్రయాణం 2 నుండి 3 రోజుల్లో పూర్తవుతుంది. సహజ శివలింగ రూపాన్ని దర్శించుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. భక్తులు కిన్నౌర్ కైలాష్ యాత్రను పూర్తి చేసిన తర్వాత ఈ శివలింగాన్ని పూజిస్తారు. కిన్నౌర్ కైలాష్ పరిక్రమ కూడా చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. కిన్నౌర్ కైలాసాన్ని హిందువుల పుణ్యక్షేత్రమే కాకుండా భౌద్ధులు కూడా పవిత్రంగా భావిస్తారు.

శివ పార్వతులతో కిన్నౌర కైలాస పర్వత సంబంధం

పురాణాల ప్రకారం శివపార్వతులు మొదటిసారి కలుసుకున్నది ఈ పర్వతం మీదనే.. అంటే వీరిద్దరూ ఈ ప్రదేశంలో మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నారు. శివుడు, పార్వతి కలుసుకున్నప్పుడు, ఈ ప్రదేశంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది, దీని కీర్తి ప్రపంచం అంతటా వ్యాపించింది. ఈనాటికీ కిన్నౌర్ కైలాస యాత్రలో బ్రహ్మకమలం పుష్పాలు తరచుగా కనిపిస్తాయని చెబుతారు. అయితే మనస్సు స్వచ్ఛంగా, శివయ్య మీద భక్తితో నిండిన వారికే ఈ పుష్పం కనిపిస్తుందని నమ్మకం.

కిన్నౌర్ కైలాస యాత్ర ప్రాముఖ్యత

కిన్నౌర్ కైలాష్ గురించి అనేక జానపద కథలు ప్రబలంగా ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం కిన్నౌర్ కైలాస పర్వతం శివపార్వతుల సమావేశ స్థలం. ఈ కారణంగా ఈ స్థలాన్ని గతంలో ప్రేమ సమవేశ స్థలం అని పిలిచేవారు. పురాణాల ప్రకారం శివుడు ప్రతి సంవత్సరం శీతాకాలంలో కిన్నౌర్ కైలాస శిఖరం వద్ద దేవతామూర్తులతో సమావేశాన్ని నిర్వహించేవాడు.

కిన్నౌర్ కైలాష్ యాత్ర 2024 ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 26 వరకు కిన్నౌర్ కైలాష్ యాత్ర నిర్వహించనున్నారు. కిన్నౌర్ కైలాష్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జూలై 25 నుండి ప్రారంభమైంది. యాత్రికులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏ విధంగానైనా నమోదు చేసుకోవచ్చు.

కిన్నౌర్ కైలాష్ యాత్ర ఎప్పుడు జరుగుతుంది?

కిన్నౌర్ కైలాష్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఒక పర్వతం. కిన్నౌర్ కైలాష్ 6050 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని హిందువులు, బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. తీర్థయాత్ర ఆగస్టులో ప్రారంభమవుతుంది, ఒక రోజులో 200 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తారు.

కిన్నౌర్ కైలాష్ యాత్ర ఎందుకు ప్రసిద్ధి చెందింది?

కిన్నౌర్ కైలాష్‌కు వెళ్లే మార్గం చాలా కష్టం. ఇక్కడికి వెళ్లే మార్గంలో రెండు కష్టతరమైన రహదారుల గుండా సాగుతుంది. మొదటిది లాలాంటి పాస్ , రెండవది చరంగ్ పాస్. కిన్నౌర్ కైలాష్ శిఖరం 6050 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని హిందూ, బౌద్ధ కిన్నౌరీలు పవిత్రంగా భావిస్తారు. కిన్నౌర్ కైలాష్ పర్వతం ఒక భారీ ఏకశిలా స్తంభం. ఇది హిందూ మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!