AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Panchami 2024: దర్శనంతోనే సర్పదోషాలను తొలగించే ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరచుకుంటుంది.. విశిష్టత ఏమిటంటే?

ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తరచి ఉండే ఆలయానికి నాగచంద్రేశ్వరాలయం అని పేరు. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో మూడవ అంతస్తులో ఉంది. ఈ ఆలయం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజు అంటే నాగ పంచమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది.

Nag Panchami 2024: దర్శనంతోనే సర్పదోషాలను తొలగించే ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరచుకుంటుంది.. విశిష్టత ఏమిటంటే?
Nag Panchami 2024
Surya Kala
|

Updated on: Aug 07, 2024 | 7:43 AM

Share

ప్రతి సంవత్సరం శ్రవణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. నాగ పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పవిత్రమైన పండగ సందర్భంగా సంవత్సరం పొడవునా మూసి ఉండి.. ఒక్క నాగ పంచమి రోజున మాత్రమే 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం ఉందని తెలుసా.. ఆ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ మహత్యం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఈ విశిష్ట దేవాలయం పేరు ఏమిటంటే?

ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తరచి ఉండే ఆలయానికి నాగచంద్రేశ్వరాలయం అని పేరు. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో మూడవ అంతస్తులో ఉంది. ఈ ఆలయం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజు అంటే నాగ పంచమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది.

ఇవి కూడా చదవండి

దేవాలయం గురించి ఉన్న నమ్మకం ఏమిటంటే?

ఈ ఆలయంలో స్పరాలకు రాజు తక్షకుడు నివసిస్తాడనే నమ్మకం. ఆలయంలో నాగ దేవతకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహం ఉంది, ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదని.. దీనిని నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చినట్లు చెబుతారు. ఈ విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నాగేంద్రుడి శివుడికి సంబంధించిన యొక్క ఏకైక విగ్రహం. ఈ నాగేంద్రుడి విగ్రహంలో విష్ణువు, లక్ష్మిదేవికి బదులుగా.. శివపార్వతులు ఆశీనులై ఉన్నారు. ఏడాదిలో నాగ పంచమి రోజున తెరచి ఉండే ఈ ఆలయంలో నాగపంచమి నాడు మూడుసార్లు పూజిస్తారు.

ఆలయంలో గర్భ గుడిలో కొలువు దీరి భక్తులతో ఏడాదికి ఒకసారి పూజలను అందుకుంటున్న ఈ విగ్రహంలో శివ పార్వతులు తమ తనయుడు గణపతితో కలిసి పది ముఖాల సర్పరాజుని పీఠంగా చేసుకుని కుర్చుని ఉన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇదొకటే అని .. ఇక్కడ తప్ప ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదని చెబుతారు.

ఈ సంవత్సరం నాగచంద్రేశ్వరాలయం ఎప్పుడు తెరవబడుతుంది?

ప్రతి ఏడాది ఈ ఆలయం నాగ పంచమి రోజున మాత్రమే తెరవబడుతుంది. ఈసారి నాగ పంచమి ఆగష్టు 9వ తేదీన జరుపుకోనున్నారు. అందువల్ల ఈ ఏడాది ఈ నాగచంద్రేశ్వరాలయం ఆగస్టు 8వ తేదీ రాత్రి 12 గంటలకు తలుపులు తెరుచుకోగా, మరుసటి రోజు ఆగస్టు 9వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి. దీని తరువాత నాగచంద్రేశ్వరాలయం మళ్లీ ఒక సంవత్సరం పాటు మూసివేయబడుతుంది. నాగచంద్రేశ్వరుని దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం మాత్రమే ఉంది.

అందువల్ల ఈ ఆలయంలో నాగచంద్రేశ్వరుని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో నాగచంద్రేశ్వరాలయానికి చేరుకుంటారు. ఇక్కడికి స్వామివారిని నాగ పంచమి రోజున దర్శనం చేసుకుంటే భక్తులకు అన్ని రకాల సర్పదోషాల నుండి విముక్తి లభిస్తుందని, అందుకే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారని ఒక నమ్మకం.

ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎందుకు తెరుస్తారంటే?

నాగచంద్రేశ్వరాలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎందుకు తెరుచుకుంటుంది అనే విషయంపై కూడా ఒక పురాణ కథనం ఉంది. దాని ప్రకారం ఒకసారి సర్ప రాజు తక్షకుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. శివయ్య అతని తపస్సుకు సంతోషించాడు. తక్షకుడికి అమరత్వాన్ని అనుగ్రహించాడు. దీని తరువాత తక్షకుడు శివుడి సన్నిధిలో నివసించడం ప్రారంభించాడు. అయితే మహాకాల్ అడవిలో నివసించే ముందు తక్షకుడు తన ఏకాంత సేవలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుకున్నాడు. అందుచేత నాగ పంచమి రోజున మాత్రమే దర్శనానికి అందుబాటులో ఉండేలా కొన్నాళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మిగిలిన సంవత్సరంలో తక్షకుడు కోరిక గౌరవార్థం ఆలయం సంప్రదాయం ప్రకారం మూసివేయబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు