Bangladesh: షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలకపాత్ర..

వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం బంగ్లాదేశ్‌లో చినికిచినికి గాలివానగా మారింది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు నహిద్‌ ఇస్లామ్‌. జులైలో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినప్పటికి వెనుకాడలేదు. నహిద్‌తో పాటు ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌తో భేటీ అయ్యారు. . నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు.

Bangladesh: షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలకపాత్ర..
Nahid Islam
Follow us

|

Updated on: Aug 07, 2024 | 7:17 AM

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో స్టూడెంట్‌ లీడర్‌ నహిద్‌ ఇస్లామ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. అవును అమవీరులకు ఇచ్చే  రిజర్వేషన్ రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల తిరుగుబాటుకు 26 ఏళ్ల యువకుడు నాయకత్వం వహించాడు .. ఢాకా యూనివర్సిటీకి చెందిన నహిద్‌ ఇస్లామ్‌ నేతృత్వం లోనే ఈ ఉద్యమం సాగింది. షేక్‌ హసీనా ప్రభుత్వానికి నహిద్‌ ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కూడా అతడే కీలకపాత్ర వహించబోతున్నాడు. సైప్యంతో చర్చల్లో నహిద్‌ ఇస్లామ్ పాల్గొంటున్నాడు.

వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం బంగ్లాదేశ్‌లో చినికిచినికి గాలివానగా మారింది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు నహిద్‌ ఇస్లామ్‌. జులైలో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినప్పటికి వెనుకాడలేదు. నహిద్‌తో పాటు ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌తో భేటీ అయ్యారు. . నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నాడు.

1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్‌ జన్మించాడు. అతడి తండ్రి టీచర్‌. అతడి సోదరుడు నఖిబ్‌ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పటికి షేక్‌ హసీనా సర్కార్‌ కుప్పకూలే వరకు పంతంతొ పోరాడారు నహిద్‌. మాన‌వ హ‌క్కుల కార్యకర్తగా కూడా నహిద్‌ ఇస్లామ్‌కు గుర్తింపు ఉన్న‌ది. షేక్ హ‌సీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా న‌హిద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయ‌కుల‌ను ఉగ్రవాదులుగా పోల్చడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశాడు.

ఇవి కూడా చదవండి

జూలై 19వ తేదీన సుమారు 25 మంది న‌హిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అత‌ని కళ్లకు గంత‌లు కట్టి, చేతుల‌కు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల త‌ర్వాత పూర్బాచ‌ల్ వ‌ద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అత‌న్ని అప‌స్మార‌క స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మ‌రోసారి కూడా అత‌న్ని కిడ్నాప్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. ఎవరంటే?
షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. ఎవరంటే?
బ్రేకప్ బాటలో మరో జంట.. ప్రేమకు సాహో బ్యూటీ స్వస్తి..
బ్రేకప్ బాటలో మరో జంట.. ప్రేమకు సాహో బ్యూటీ స్వస్తి..
ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌..
ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌..
త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?
త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?
టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్..!
టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్..!
ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
'కెప్టెన్ మెటీరియల్.. 3 ఫార్మాట్లలో రోహిత్ వారసుడు అతడే'
'కెప్టెన్ మెటీరియల్.. 3 ఫార్మాట్లలో రోహిత్ వారసుడు అతడే'
టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌
టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌
మహిళలకు ఇది కదా కావాల్సింది..భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు ఇది కదా కావాల్సింది..భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంతంటే
Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..