AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Panchami: నాగ పంచమి రోజున ఈ అరుదైన యాదృచ్చికాలు.. ఈ సమయంలో పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ మాయం..

వేద పంచాంగం ప్రకారం పంచమి తిధి ఆగస్టు 8వ తేదీ ఉదయం 12:36 గంటలకు ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది. ఈసారి సావన్‌లో, నాగ పంచమి పండుగ శుక్రవారం 9 ఆగస్టు 2024న జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 06:01 నుంచి 08:37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది.

Nag Panchami: నాగ పంచమి రోజున ఈ అరుదైన యాదృచ్చికాలు.. ఈ సమయంలో పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ మాయం..
Naga Panchami Puja
Surya Kala
|

Updated on: Aug 07, 2024 | 8:14 AM

Share

హిందూ మతంలో సకల జీవుల్లో దైవాన్ని చూడమని నమ్మకం. అందుకనే చెట్లు, పక్షులు, పాములు, జంతువులూ వంటి వాటిని కూడా దైవంగా భావించి నియమ నిష్టలతో పూజిస్తారు. అలాంటి పండగల్లో ఒకటి నాగ పంచమి. శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజు, నాగ పంచమిన పాముల దేవుడిగా భావించి పూజిస్తారు. ఈ రోజు వాసుకి, ఐరావత, మణి భద్ర, కాళిక, ధనుంజయ, తక్షకుడు, కర్కోట క్ష, ధృతరాష్ట్ర అనే అష్ట నాగదేవతలను పూజించే సంప్రదాయం ఉంది. వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నాగ పంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో పూజలు చేయడం చాలా శుభప్రదం.

నాగ పంచమి తేదీ, శుభ ముహూర్తం 2024

వేద పంచాంగం ప్రకారం పంచమి తిధి ఆగస్టు 8వ తేదీ ఉదయం 12:36 గంటలకు ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది. ఈసారి సావన్‌లో, నాగ పంచమి పండుగ శుక్రవారం 9 ఆగస్టు 2024న జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 06:01 నుంచి 08:37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నాగ పంచమి పూజా విధానం

నాగ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. దీని తరువాత శివలింగానికి నీటిని సమర్పించి, శివుడిని పూజించండి. దీని తరువాత ఇంటి ప్రధాన ద్వారం ఇంటి బయట తలుపుకు రెండు వైపులా సుద్దతో పేయింగ్ వేసి బొగ్గుతో నాగదేవతల చిహ్నాలను తయారు చేయండి. దీని తరువాత నాగదేవతను పూజించడం ప్రారంభించి, నాగదేవతకు పూలు, పండ్లు, ధూపం, దీపం, పచ్చి పాలు , నైవేద్యాన్ని సమర్పించండి. చివరగా నాగదేవతకు హారతి చేయండి.

నాగ పంచమి శుభ యోగా

ఈసారి నాగ పంచమి నాడు అనేక యోగాలు రూపుదిద్దుకోబోతున్నాయి. వీటిలో శివ్వాస్ యోగా, సిద్ధ యోగా, సాధ్య యోగా, బల్వ కరణ యోగా ఉన్నాయి. ఈ సారి నాగ పంచమిని హస్తా నక్షత్రం యొక్క పవిత్ర యాదృచ్చికంగా జరుపుకుంటారు. ఈ అరుదైన యాదృచ్చికాల్లో పూజించడం ద్వారా వక్తి అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతాడు. జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.

శివ్వాస్ యోగా

వైదిక క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి నాడు అరుదైన శివస్ యోగం రూపుదిద్దుకుంటోంది. ఈ రోజున పరమశివుడు కైలాసంపై పార్వతీమాత సమేతంగా ఉంటాడు. ఈ సమయంలో, శివ కుటుంబ సమేతంగా నాగదేవతను పూజించడం ద్వారా సాధకుడు అన్ని రకాల ఆనందాలను పొందుతాడు. నాగదేవత ఆశీస్సులు కూడా లభిస్తాయి.

సిద్ధ, సాధ్య యోగా

నాగ పంచమి నాడు సిద్ధ యోగం యాదృచ్చికం కూడా ఉంది. సిద్ధయోగం మధ్యాహ్నం 1:46 గంటల వరకు ఉంటుంది. ఈ కాలంలో శివుని పూజించడం వల్ల అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. దీని తర్వాత సాధ్య యోగం ఏర్పడుతోంది.

బల్వ కరణ యోగ బాల, బల్వ కరణ యోగా కూడా నాగ పంచమి నాడు రూపొందుతోంది. ఈ సమయంలో శివుడు, నాగదేవతలను పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

నాగ పంచమి ప్రాముఖ్యత

శ్రవణ మాసం వర్షాకాలం ఈ మాసంలో పాములు కలుగు నుంచి బయటకు అంటే నేలపై సంచరిస్తాయి. పాములు ఎవరికీ హాని కలిగించకుండా ఉండటానికి నాగ పంచమిని పూజిస్తారు. గ్రంధాలు, పురాణాల ప్రకారం పంచమి తిథికి అధిపతి నాగేంద్రుడు. ఈ రోజున పాములను పూజించడం ద్వారా కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఈ రోజున నాగదేవతలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రాహు , కేతువులకు సంబంధించిన దోషాల నుండి ఉపశమనం పొందుతారు,కాల సర్ప దోషం కూడా తొలగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు