AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: వైభవంగా భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవం.. ‘స్త్రీ’ వేషధారణలో హారతినిచ్చిన ఉద్యోగి..

అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో రెండోవ విడత సాత్విక బలులను సమర్పించారు. అలానే మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. అంతకుముందు శ్రీ మల్లి కార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర శొంటి భక్షాలతో కప్పేశారు.

Srisailam: వైభవంగా భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవం.. 'స్త్రీ' వేషధారణలో హారతినిచ్చిన ఉద్యోగి..
Srisailam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 26, 2024 | 8:42 PM

Share

నంద్యాల జిల్లా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ బ్రమరాంబాదేవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో రెండోవ విడత సాత్విక బలులను సమర్పించారు. అలానే మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. అంతకుముందు శ్రీ మల్లి కార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర శొంటి భక్షాలతో కప్పేశారు. అనంతరం శ్రీ స్వామివారి అలయంలో పనిచేసే ఉద్యోగి ‘స్త్రీ’ వేషధారణలో అలంకరించుకుని చేతిలో హారతితో వేదమంత్రోత్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

అమ్మవారి ప్రధానార్చకులు ఆలయద్వారలు తెరవగా ‘స్త్రీ’ వేషంలో ఉన్న స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతినిచ్చారు. అనంతరం ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీ చక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన ‘స్త్రీ’ వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం. కుంభహారతి అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు, స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు, స్ధానికులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్