Astrology: పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక తెలుసుకోండి!
These Items to Keep in Pooja Room: పూజగదిలో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం పెరుగుతాయని సంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. నెమలి ఈకల నుంచి తామర గింజల వరకు ఏ వస్తువులు శుభప్రదంగా భావిస్తారో తెలుసుకోండి. వాటి వల్ల వచ్చే పలితాలనూ తెలుసుకుందాం.

Goddess Lakshmi Blessings: ప్రతి ఇంట్లో భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా పూజగది ఉంటుంది. దేవతల చిత్రాలు, దీపారాధనకు అవసరమైన సామగ్రితో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను పూజగదిలో ఉంచడం శుభప్రదమని చాలామంది విశ్వసిస్తారు. జ్యోతిష్యం, పరిహార శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ఐశ్వర్యం, ప్రశాంతతకు దోహదపడతాయని చెబుతారు.
నెమలి ఈకలు
పూజగదిలో నెమలి ఈకలు ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం. అలాగే గ్రహదోషాల ప్రభావం తగ్గి, ఇంట్లో శుభవాతావరణం నెలకొంటుందని చెబుతారు.
ఆవు – దూడ చిత్రపటం లేదా విగ్రహం
ఆవును భారతీయ సంస్కృతిలో పవిత్రంగా భావిస్తారు. ఆవు దూడతో కూడిన చిత్రం లేదా విగ్రహాన్ని పూజగదిలో ఉంచడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని నమ్మకం.
చిన్న ఛత్రం (గొడుగు)
వెండి, రాగి లేదా పంచలోహాలతో తయారైన చిన్న ఛత్రాన్ని పూజగదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు చామరం లేదా వింజామర ఉంచితే ఆధ్యాత్మిక వాతావరణం మరింత మెరుగవుతుందని చెబుతారు.
పసుపు గవ్వలు
లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో గవ్వలు ఒకటిగా భావిస్తారు. ముఖ్యంగా పసుపు వర్ణంలో కనిపించే గవ్వలను పూజగదిలో ఉంచడం వల్ల ధనసంపద, అదృష్టం పెరుగుతాయని విశ్వసిస్తారు.
గంధపు చెక్క
పూజల్లో గంధానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గంధపు చెక్కను పూజగదిలో ఉంచడం వల్ల పవిత్రత, ప్రశాంతత పెరుగుతాయని చెబుతారు.
అక్షింతలు
పసుపు కలిపిన అక్షింతలు శుభకార్యాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని పూజగదిలో ఉంచడం వల్ల దేవీదేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
పచ్చకర్పూరం
సాధారణ కర్పూరంతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా పూజగదిలో ఉంచడం మంచిదని అంటారు. దీని సువాసన వాతావరణాన్ని పవిత్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తామర గింజలు, ముత్యాల మాల
తామర పువ్వు లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల తామర గింజలు, ముత్యాల మాల లేదా వెండి పుష్పాలను పూజగదిలో ఉంచడం ఐశ్వర్యానికి సంకేతంగా పరిగణిస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, వాస్తు శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




