AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత.. ఇదిగో పూర్తి వివరాలు

కళియుగదైవం.. తిరుమల తిరుపతి దేశస్థానంలో మే నెల అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. భక్తులకు శ్రీవారి దర్శనం కలిగించడం తోపాటు హుండీ ఆదాయం, ప్రసాదాలు, తలనీలాల సమర్పణ ఇలా అన్ని సేవల్లో గత నెలలో టీటీడీ సరికొత్త రికార్డులను నెల కొల్పి భక్తుల మన్నలు పొందుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

TTD: శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత.. ఇదిగో పూర్తి వివరాలు
Ttd May Records
Raju M P R
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 12:13 PM

Share

శ్రీవారి ధర్శనం, హుండీ ఆదాయం, ప్రసాదాల విక్రమం, తలనీలాల సమర్పణ.. ఇలా అన్ని సేవల్లో మే నెలలో టీటీడీ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. వేసవి సెవలవుల నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనం కోసం క్యూ కట్టే భక్తులతో కొండ కిటకిట లాడుతోంది. టెక్నాలజీని ఉపయోగించి సేవల్లో మరింత నాణ్యత తెచ్చే ప్రయత్నంలో టిటిడి సక్సెస్ అవుతోంది. పారదర్శక పాలనతో జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే టిటిడి గత మే నెలలో పలు రికార్డులు నమోదు చేసింది.

భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు హుండీ ఆదాయం, వసతి, తలనీలాలు సమర్పణలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. గతేడాది మే నెలలో 23.79 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ ఈ ఏడాది మే నెలలో 1.67 లక్షల మంది భక్తులకు అదనంగా అంటే ఈ ఏడాది మే నెలలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శంచుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇక మే 24న అత్యధికంగా 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. గత మే నెలలో 7 సార్లు 90 వేల మందికి పైగానే భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనంలోనే కాదు తలనీలాల సమర్పణలోనూ టీటీడీ మరో రికార్డు సృష్టించింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా ఈ ఏడాది మే నెలలో ఎక్కువే. గతేడాది మే నెలలో 10.26 లక్షల మంది తలనీలాలు సమర్పించగా.. ఈ ఏడాది మే నెలలో గతేడాది మే నెల కంటే 1.93 లక్షల మంది అంటే 12.19 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు.

ఇక కానుకలను సైతం మే నెలలో శ్రీవారికి ఎక్కువగానే సమర్పించారు. హుండీ ఆదాయంలోనూ గత ఏడాది మే నెలతో పోల్చితే ఈ సారి ఎక్కువే. గత మేలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 120.28 కోట్లు వచ్చింది. గతేడాది మే నెలలో రూ. 106.85 కోట్లు రాగా పెరిగిన ఆదాయం రూ. 13.43 లక్షలుగా టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us