చిన్నదే కానీ లాభాలు తెలిస్తే అవాక్కే.. రోజూ తింటే మామూలుగా ఉండదు
Krishna
02 June 2026
కివీలో విటమిన్ సి ఫుల్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ప్రతి ఉదయం కివీ తినడం వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే కాలానుగుణ అనారోగ్యాలు, జలుబు, జ్వరం, రకరకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
పవర్‌హౌస్
కివీలో యాక్టినిడిన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను ఈజీగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి పొట్ట సమస్యలన్నీ క్లియర్ అవుతాయి.
జీర్ణక్రియ
విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల కివీ పండు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తుంది. ఇది బాడీలో 'కొల్లాజెన్' ఉత్పత్తిని పెంచి, ముఖంపై ముడతలను తగ్గించి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.
మెరిసే చర్మం
కివీలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. తద్వారా హై బ్లడ్ ప్రెజర్ నియంత్రణలోకి వచ్చి, హార్ట్ హెల్త్ మెరుగవుతుంది.
గుండె సేఫ్
కివీలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, తరచుగా ఆకలి వేయడాన్ని నివారిస్తుంది. ఓవరాల్‌గా బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది.
బరువు
కివీ పండు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యల నుండి కళ్లను కాపాడి, చూపును మెరుగుపరుస్తాయి.
కంటి చూపు
కివిలో నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ డిటాక్స్ ఫ్రూట్‌లా పనిచేస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపించి, జీర్ణవ్యవస్థను, రక్తాన్ని శుభ్రం చేయడంలో కివీ సూపర్‌గా పనిచేస్తుంది.
వ్యర్థాలు క్లీన్
కివీలో ఉండే వైవిధ్యమైన పోషకాలు మీ బాడీలోని మెటబాలిజాన్ని పెంచుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా అలసట లేకుండా ఇన్‌స్టంట్ ఎనర్జీతో యాక్టివ్‌గా ఉండేందుకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది.