Ganapati Ladoo: ఆల్ టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణపతి లడ్డూ.. ఈ డబ్బులతో ఏం చేయనున్నారో తెలుసా..?
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఇక్కడ గణపతి లడ్డూ ధర కోటి 87 లక్షల రూపాయిలు పలికింది. ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కనివినీ రీతిలో ఓ వైపు గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో లడ్డూ వేలం పాటలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అందరి దృష్టి బాలాపూర్ లడ్డు వేలం పాట వైపే ఉండగా.. తాజాగా భాగ్యనగరంలోనే రికార్డ్ స్థాయిలో వేలంపాట సాగింది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఇక్కడ గణపతి లడ్డూ ధర 1. 87 కోట్ల రూపాయిలు పలికింది.
ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బుతో ట్రస్ట్ పేదలకు సహాయం చేయనుంది. ఈ డబ్బులతో పేద ప్రజలు, హాస్టల్స్‌లోని విద్యార్ధులకు సహాయ సహకారాలు అందించనున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే గత ఏడాది లడ్డూ ప్రసాదం 1 కోటి 26 లక్షల రూపాయలు పలకగా.. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..