AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వైవాహిక జీవితం అందంగా సాగాలంటే చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి..లేదంటే పట్టాలు తప్పుతుంది..

మీ స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు.. వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది. అటువంటి పరిస్థితిలో వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలంటే పొరపాటున కూడా పునరావృతం చేయకూడని కొన్ని పనులున్నాయి. వీటిని శాశ్వతంగా వదిలివేయవలసి ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాదు.. ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి కూడా..

Chanakya Niti: వైవాహిక జీవితం అందంగా సాగాలంటే చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి..లేదంటే పట్టాలు తప్పుతుంది..
Chanakya On Relation
Surya Kala
|

Updated on: Sep 18, 2024 | 7:04 AM

Share

వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం.. చాలా సమన్వయం అవసరం. కనుక ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. లేదా వివాహం చేసుకోబోతున్నా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా నిర్లక్షం చేయడం చాలా సార్లు జరుగుతుంది. అందుకు తగిన పర్యవసానాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. అందుకు కారణం మీ స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు.. వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది. అటువంటి పరిస్థితిలో వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలంటే పొరపాటున కూడా పునరావృతం చేయకూడని కొన్ని పనులున్నాయి. వీటిని శాశ్వతంగా వదిలివేయవలసి ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాదు.. ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి కూడా..

గోప్యత భార్యాభర్తల మధ్య సంబంధంలో గోప్యత చాలా ముఖ్యం. భార్యాభర్తలు తమ మధ్య ఉన్న విషయాలను తమలో తామే ఉంచుకోవాలి. ఆ విషయాలను ఏ విధంగానూ మూడవ వ్యక్తికి చేరనివ్వకూడదు. భార్యాభర్తల మధ్య రహస్యాలు మూడో వ్యక్తికీ చేరితే అది సంబంధంలో నమ్మకాన్ని నాశనం చేస్తుంది. అంతే కాకుండా అపార్దాలు కూడా తలెత్తుతాయి.

అబద్ధం ఈ ఒక్క అలవాటు భార్యాభర్తల బంధాన్నే కాదు ఎలాంటి సంబంధాన్ని అయినా నాశనం చేస్తుంది. ఏదైనా సంబంధమైనా సరే అబద్ధాలపై ఎంతో కాలం నిలబడి ఉండదు. సంబంధంలో అబద్ధాలు ఉంటే ఆ సంబంధానికి ఎటువంటి ఆధారం ఉండదు. అబద్ధాల మీద ఏర్పాటు చేసుకున్న సంబంధం ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చు. అందువల్ల ఎటువంటి సందర్భం ఎదురైనా అబద్ధాలను ఆశ్రయించడం మంచిది కాదని అది విషాదకరంగా మిగులుస్తుందని ఆచార్య చాణక్యుడు నొక్కిచెప్పారు.

ఇవి కూడా చదవండి

ఖర్చు భార్యాభర్తల మధ్య సంబంధంలో డబ్బు విషయాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి. నేటి కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా సంపాదిస్తున్నారు. పూర్వ కాలంలో ఇద్దరి పాత్రలు కాస్త భిన్నంగా ఉండేవి. అయితే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జంటలు సంపాదిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో డబ్బు విషయాలకు సంబంధించి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. పొదుపు, ఖర్చు , పెట్టుబడి గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి ఆర్థిక పరిస్థితి గురించి మరొకరు తెలుసుకోవాలి. అంతేకాదు అనవసరమైన ఖర్చులను నివారించండి. ఎందుకంటే సంపదన, లేమి వల్ల చాలా సంబంధాలలో పగుళ్లు ఏర్పడతాయి.

వ్యసనాలు వ్యసనం మానవులకు శారీరకంగా మాత్రమే హానికరం కాదు.. వారిని మానసికంగా, సామాజికంగా చాలా బలహీనంగా చేస్తుంది. మాదకద్రవ్యాలకు బానిసైన వారి జీవితాలు ఎప్పటికీ తిరిగి పట్టాలెక్కవు. అలాంటి పరిస్థితుల్లో భర్త అయినా, భార్య అయినా సరే.. ఏదైనా మత్తుకి అలవాటు అయితే ఆ అలవాట్ల నుంచి బయటపడాలి. అసలు వ్యసనాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవడానికి మద్యం వ్యసనమే అతి పెద్ద కారణమని పలు సర్వేల్లో వెల్లడైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి