Yoga Benefits: రోజంతా శక్తివంతంగా, యాక్టివ్‌గా ఉండాలంటే ఈ యోగాసనాలు రోజూ ట్రై చేయండి..

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని సులభమైన యోగా ఆసనాలను చేయవచ్చు. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లడానికి లేదా వాకింగ్ చేయడానికి ఎక్కువ సమయం దొరకని వ్యక్తులు ఉదయం 20 నుండి 25 నిమిషాల సమయం కేటాయించి ఇంట్లోనే ఈ సులభమైన యోగాసనాలను చేయవచ్చు.

Yoga Benefits: రోజంతా శక్తివంతంగా, యాక్టివ్‌గా ఉండాలంటే ఈ యోగాసనాలు రోజూ ట్రై చేయండి..
Yoga Benefits
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2024 | 10:30 AM

యోగా మనిషి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడమే కాదు.. అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఇది సహాయపడుతుంది. దీనితో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో బిజీ లైఫ్ కారణంగా అలసిపోతున్నా, ఒత్తిడికి గురవుతున్నా ప్రతిరోజూ ఉదయం కొన్ని యోగా ఆసనాలు చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా, శక్తివంతంగా ఉంటారు.

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని సులభమైన యోగా ఆసనాలను చేయవచ్చు. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లడానికి లేదా వాకింగ్ చేయడానికి ఎక్కువ సమయం దొరకని వ్యక్తులు ఉదయం 20 నుండి 25 నిమిషాల సమయం కేటాయించి ఇంట్లోనే ఈ సులభమైన యోగాసనాలను చేయవచ్చు.

తాడాసనం: తాడాసనాన్ని పర్వత భంగిమ అని కూడా అంటారు. ఇది శరీర భంగిమను మెరుగుపరచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం, సరైన జీర్ణక్రియను నిర్వహించడం, వెన్ను, మెడ నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు కండరాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లను ఒకదానితో ఒకటి చేర్చండి. చేతులు శరీరం వైపులా ఉంచండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తలపై చేతులను పైకి లేపండి. కాలి మీద నిలబడండి. భుజాలు, పండ్లు, చీలమండలు .. తల ఒక సరళ రేఖలో ఉంచాలని గుర్తుంచుకోండి. అలాగే మెడ, నడుము నిటారుగా ఉంచండి.

ఇవి కూడా చదవండి

వృక్షాసనం వృక్షాసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ యోగా ఆసనం చేయడం వల్ల భంగిమను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం, కాలి కండరాలను బలోపేతం చేయడం, సమతుల్యతను సృష్టించడం వంటివి చేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా ఒక కాలుని నేలపై స్థిరంగా ఉంచి, .. రెండో కాలి పాదాన్ని తొడ లేదా నెల మీద ఉంచిన కాలి మోకాలిపై ఆ పాదం అమర్చాలి. ఇలా చేస్తూ మీ సమతుల్యతను కాపాడుకోండి. దీని తరువాత చేతులను తలపైకి పైకెత్తి, నమస్కార భంగిమను చేసి ముందు వైపు చూడండి. ఈ భంగిమలో వెన్నెముక నిటారుగా ఉంచండి. 30 సెకన్ల నుండి 1 నిమిషం వరకు ఈ స్థితిలో ఉండండి, ఆపై కాళ్ళు మార్చుకోండి.

భుజంగాసనం భుజంగాసనాన్ని కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఇది వెన్నెముక వశ్యతను పెంచడంలో, వెన్ను దృఢత్వాన్ని తగ్గించడంలో, ఒత్తిడిని తొలగించడం ద్వారా మనస్సును శాంతపరచడంలో పొట్ట , నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా యోగా మ్యాట్‌పై మీ కడుపుపై పడుకుని రెండు కాళ్లను కలిపి ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను మీ ఛాతీ దగ్గరకు తీసుకుని, అరచేతిని నేలపై ఆనించాలి. దీని తరువాత అరచేతులపై ఒత్తిడిని ప్రయోగిస్తున్నప్పుడు ఆకాశం లేదా పైకప్పును చూస్తున్నట్లుగా ఛాతీ, తలను పైకి ఎత్తండి. ఈ భంగిమను కొన్ని సెకన్ల పాటు ఉంచడానికి ప్రయత్నించండి.

అయితే శరీరంలోని ఏ భాగానైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా నొప్పి ఉంటే ఈ యోగా ఆసనాలను చేసే ముందు నిపుణుల సలహా తీసుకొని వారి పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనాలను చేయండి. శరీరానికి, ఆరోగ్యానికి తగిన యోగాసనాలు వేయమని నిపుణులు సలహా ఇస్తారు. సరైన పద్ధతిని చెబుతారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.