AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: స్కూలుకు వెళ్లమని పిల్లలు అల్లరి చేస్తున్నారా.? ఇలా చేయండి..

స్కూలుకు వెళ్లేందుకు చిన్నారులు మారాం చేయడం సర్వసాధారణమైన విషయం. దీంతో ఉదయం లేవగానే చాలా మంది ఇళ్లలో చిన్న సైజ్ యుద్ధమే జరుగుతుంది. పిల్లలను స్కూలుకు పంపించాలంటే కొందరికి తల ప్రాణం తోకకు...

Parenting Tips: స్కూలుకు వెళ్లమని పిల్లలు అల్లరి చేస్తున్నారా.? ఇలా చేయండి..
Parenting Tips
Narender Vaitla
|

Updated on: Sep 16, 2024 | 2:39 PM

Share

స్కూలుకు వెళ్లేందుకు చిన్నారులు మారాం చేయడం సర్వసాధారణమైన విషయం. దీంతో ఉదయం లేవగానే చాలా మంది ఇళ్లలో చిన్న సైజ్ యుద్ధమే జరుగుతుంది. పిల్లలను స్కూలుకు పంపించాలంటే కొందరికి తల ప్రాణం తోకకు వస్తుంది. అయితే చిన్నారులను స్కూళ్లకు పంపించడానికి కొన్ని రకాల టిప్స్‌ పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్కూలుకు వెళ్లమని పిల్లలు మారాం చేస్తుంటే.. నేరుగా మీరు పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, సాయంత్రం తీసుకురావడం చేస్తుండాలి. అలాగే వారికి నచ్చిన స్నాక్స్‌ను టిఫిన్‌లో పెట్టాలి. ఇక స్కూలు నుంచి తిరిగి రాగానే స్కూల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి. రోజు ఎలా గడిచిందో అడగాలి.

* చిన్నారులకు అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులను ఇవ్వడం అలవాటు చేస్తుండాలి. ఏదో ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తేనే ఇస్తామని అని కాకుండా. స్కూల్లో వారు చేసే చిన్న చిన్న పనులకు కూడా బహుమతులు ఇవ్వడం అలవాటు చేస్తుండాలి. దీనివల్ల వారిలో స్కూలుకు క్రమంతప్పకుండా వెళ్లాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది.

* ఇక పిల్లలను బలవంతంగా కొట్టి, తిట్టి, ఆరుస్తూ స్కూళ్లకు తీసుకెళ్లకూడదు. దీంతో వారిలో మరింత భయం పెరిగే అవకాశం ఉంటుంది. అసలు వాళ్లు స్కూలుకు ఎందుకు వెళ్లమంటున్నారో అడిగి తెలుసుకొని దానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి.

* కొంత మంది చిన్నారులు టీచర్లకు భయపడి కూడా స్కూలుకు వెళ్లమని మారాం చేస్తుంటారు. అలాంటిది ఏదైనా ఉంటే టీచర్లతో మాట్లాడి ముందుగా చిన్నారుల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. చిన్నారులు క్రమంతప్పకుండా పాఠశాలకు వెళ్తే చదువు దానంతటదే వస్తుందనే విషయాన్ని గుర్తించుకోవాలి.

* ఇక చిన్నారులకు స్కూల్లో విద్యార్థులను పెంచుకోమని ప్రోత్సహిస్తుండాలి. అలాగే వీలైనంత వరకు ఇంటి పక్కన ఉన్న చిన్నారులు ఒకే క్లాసులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వారికి ప్రతీరోజూ స్కూలుకు వెళ్లాలన్న ఆసక్తి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..