AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home remedies: తామరతో ఇబ్బంది పడుతున్నారా.. దురద, మంట నుంచి ఉపశమనం కోసం వంటింటి చిట్కాలు..

తామర వ్యాధి డెర్మటోఫైట్స్ అనే శిలీంధ్రాల ద్వారా వ్యాపిస్తుంది. ఇవి వేడి, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందుతాయి. కనుక వేడి , తేమతో కూడిన వాతావరణంలో తామర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే, అది క్రమంగా చర్మం అంతా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా తామర వృత్తాకారంలో ఉంటుంది. దీనిలో చర్మంలో ఎరుపు, దురద దద్దుర్లు పొలుసులుగా కనిపిస్తాయి. అయితే ఈ తామర నుంచి ఉపశమనం కోసం కొన్ని ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి.

Home remedies: తామరతో ఇబ్బంది పడుతున్నారా.. దురద, మంట నుంచి ఉపశమనం కోసం వంటింటి చిట్కాలు..
Home Remedies For Ringworm
Surya Kala
|

Updated on: Sep 16, 2024 | 8:47 AM

Share

వర్షాకాలంలో తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు కూడా పెరుగుతాయి. వాటిలో ఒకటి రింగ్‌వార్మ్ సమస్య దీనినే తామర అని కూడా అంటారు. తామర వ్యాధి డెర్మటోఫైట్స్ అనే శిలీంధ్రాల ద్వారా వ్యాపిస్తుంది. ఇవి వేడి, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందుతాయి. కనుక వేడి , తేమతో కూడిన వాతావరణంలో తామర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే, అది క్రమంగా చర్మం అంతా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా తామర వృత్తాకారంలో ఉంటుంది. దీనిలో చర్మంలో ఎరుపు, దురద దద్దుర్లు పొలుసులుగా కనిపిస్తాయి. అయితే ఈ తామర నుంచి ఉపశమనం కోసం కొన్ని ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి.

తామర తగ్గడానికి దాదాపు ఒక వారం, 10 లేదా 15 రోజులు పట్టవచ్చు. అయితే ఇది తీవ్రమైన నొప్పి, మంట, దురద వంటి ఇబ్బందులతో పాటు ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. కనుక బట్టల నుండి సబ్బు వరకు రోగి వాడే ప్రతి వస్తువుని దూరంగా ఉంచాలి. తప్పనిసరిగా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కనుక ఈ రోజు తామర నుంచి ఉపశమనం పొందడానికి ఏ వస్తువులు ఉపయోగకరమో ఈ రోజు తెలుసుకుందాం..

పసుపు,కొబ్బరి నూనె

పసుపు, కొబ్బరి నూనె రింగ్‌వార్మ్ సమస్యను వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, గాయాలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పసుపు, కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తామర ఉన్న చోట అప్లై చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి పొట్టు

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. కనుక తామర సమస్య నుండి బయటపడటానికి, వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వాటిని మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌లో కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తామర తగ్గడం ప్రారంభమవుతుంది.

కలబంద

చర్మంపై తామర ఏర్పడితే నొప్పితో పాటు చాలా దురద ఉంటుంది. మంట కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రభావిత ప్రాంతంలో తాజా కలబందను అప్లై చేయండి. ఇది మీకు నొప్పి, దురద, మంట సెన్సేషన్ నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాదు ప్రతిరోజూ నిద్ర పోయే ముందు కలబండను అప్లై చేస్తే తామర కూడా తగ్గడం ప్రారంభమవుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి మంచి సహాయకారి. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి రోజూ కనీసం రెండుసార్లు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. ఈ విధంగా చేయడం వలన తామర నుండి బయటపడతారు. సహజసిద్ధమైన వస్తువులను ఉపయోగించి తామర సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే ఇంటి చిట్కాలకు బదులుగా వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.