గణనాథులు గంగమ్మ ఒడికి చేరే వేళాయే.. మంగళ వారం మంగళప్రదంగా వినాయక నిమజ్జనోత్సవం.. భద్రతా చర్యలు కట్టుదిట్టం..
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా GHMC ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా పోలీసులు నిఘాను పెంచారు. భారీగా బలగాలను రంగంలోకి దింపారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కొనసాగుతోంది. మరో ఐదు పెద్ద చెరువులు సహా 73 కొలనుల్లో నిమజ్జనోత్సవానికి సర్వం సిద్దం చేశారు.
మండపాల్లో కొలువుదీరి వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకుని గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నం అయింది. దీంతో ఏ దారులు చూసినా వినాయక విగ్రహాలు నదిలో నిమజ్జనం కోసం తరలి వెళ్తున్న దృశ్యమే కనిపిస్తుంది.. గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతుంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదు చెరువులు ,73 కొలనుల్లో నిమజ్జనోత్సవానికి సర్వం సిద్దం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిమజ్జనం జరిగే ప్రదేశంలో ఎవరైనా ఎక్సాట్రాలు వేస్తే అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు.
జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ మహానగరంలో ఎటుచూడూ భక్త కోలాహాలంతో నిండిపోయింది. భారీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరే వేళాయింది.. మంగళ వారం మంగళప్రదంగా వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం సాగనుంది.
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా GHMC ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా పోలీసులు నిఘాను పెంచారు. భారీగా బలగాలను రంగంలోకి దింపారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కొనసాగుతోంది. మరో ఐదు పెద్ద చెరువులు సహా 73 కొలనుల్లో నిమజ్జనోత్సవానికి సర్వం సిద్దం చేశారు.
GHMC పరిధిలోని 6 జోన్లలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. సరూర్‌నగర్ చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు, బహుదూర్‌పురా మీరాలం చెరువు కాప్రా ఊర చెరువుల దగ్గర నిమజ్జన ఏర్పాట్లు సహా భద్రతను కట్టుదిట్టం చేశారు.
హుస్సేన్‌సాగర్ , ఐదు పెద్ద చెరువులు సహా 73 కొలనుల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 140 పెద్ద క్రేన్లు, 295 మొబైల్ క్రేన్స్, 102 మినీ టిప్పర్స్, 125 జేసీబీలను సిద్ధంచేశారు. అలాగే 308 మొబైల్ టాయిలెట్స్, 52వేల 270 తాత్కాలిక స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. 160 గణేష్ టీమ్స్ అల్రెడీ యాక్షన్‌లోకి దిగాయి.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు కోసం 20వేల మంది పోలీసుల్ని రంగంలోకి దింపుతున్నారు. హైదరాబాద్‌లో లక్షకు పైగా గణేష్ మండపాలు ఉన్నాయి. ఉత్సవాల చివరి రోజున 30వేలకు పైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
గణేష్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. నగరవ్యాప్తంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు, డీజే సౌండ్లపై పోలీసుల నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నగర వ్యాప్తంగా నిఘా పెంచారు. భధ్రతను కట్టుదిట్టం చేశారు. గల్లీ గల్లీలో భక్త నీరాజనాలు అందుకున్న గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికి చేరే వేళాయింది. జంట నగరాల్లో ఎక్కడచూసినా సందడే కన్పిస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..