Monday Puja Tips: జాతకంలో చంద్ర దోష నివారణకు, వివిధ కోరికలు నేరవేరడానికి సోమవారం శివుడిని ఇలా పూజించండి..

సనాతన ధర్మంలో శివుడు సృష్టి, స్థితి, ప్రళయరూపం అనే మూడు కారణాలకు శివుడే కారణం. దేవాదిదేవుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలను నివారించడానికి ఇంట్లో సుఖ సంతోషాలు శాంతితో జీవించడానికి.. జాతకంలో చంద్ర దోష నివారణకు ప్రతి సోమవారం కొన్ని పూజ నియమాలు పాటించాలి.

Monday Puja Tips: జాతకంలో చంద్ర దోష నివారణకు, వివిధ కోరికలు నేరవేరడానికి సోమవారం శివుడిని ఇలా పూజించండి..
Shiva Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2024 | 6:39 AM

హిందూ మతంలో వారంలోని ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు.. ఈ రోజు శివుడిని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. ప్రతి సోమవారం శివుడి పూజతో పాటు.. భక్తులు కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. ఈ రోజున మహాదేవుడు ఆశీస్సులు లభించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడని.. బాధలను తొలగిస్తాడని చాలా మంది నమ్ముతారు. శివుడు సృష్టి లయకారుడు. సనాతన ధర్మంలో శివుడు సృష్టి, స్థితి, ప్రళయరూపం అనే మూడు కారణాలకు శివుడే కారణం. దేవాదిదేవుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలను నివారించడానికి ఇంట్లో సుఖ సంతోషాలు శాంతితో జీవించడానికి.. జాతకంలో చంద్ర దోష నివారణకు ప్రతి సోమవారం కొన్ని పూజ నియమాలు పాటించాలి.

సోమవారం శివుడికి పూజ చేసే విధానం..

సోమవారం తెల్లవారుజామున లేచి నియమానుసారంగా శివుని పూజించాలి.

సోమవారం రోజున తలస్నానం చేసిన తర్వాత తెల్లటి దుస్తులు ధరించాలి. పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయండి. దీని వల్ల జన్మ నక్షత్రం ప్రకారం చంద్రుని స్థానం బలపడుతుంది.

ఇవి కూడా చదవండి

అకాల మరణ భయం తొలగడానికి

మత విశ్వాసం ప్రకారం, శివుని అనుగ్రహం పొందడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని సోమవారం నాడు 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారం పూర్తవుతుంది.

భోలేశంకరునికి పండ్లు, పూలు, స్వీట్లు సమర్పించండి. ఆకుపచ్చ దుప్పటి మీద కూర్చొని ఓం నమో భగవతే రాగ రుద్రాయ స్వాహా మంత్రాన్ని జపించండి.

ఈ మంత్రం జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి.. 17 సార్లు జపమాల మంత్రాన్ని జపించండి.

జపం పూర్తి చేసిన తర్వాత భోళేశంకరుడికి పండ్ల ప్రసాదాన్ని సమర్పించండి.

శివుడికి హారతి ఇచ్చి స్తుతించాలి.

రుణ విముక్తికి శివారాధన

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి నందిపై అమర్చిన శివుని ప్రతిమను పూజించండి.

ఇంట్లో పూజ గదిలో పాలరాతి శివలింగాన్ని ప్రతిష్టించండి.

శివునికి పండ్లు, పువ్వులు, స్వీట్లను సమర్పించండి. శివునికి పంచోపచార పూజలు చేయండి.

ఎర్రటి దుప్పటి మీద కూర్చొని “ఓం నమో భగవతే గంగ రుద్రాయ స్వాహా” అనే మంత్రాన్ని జపించండి.

ఈ సమయంలో తూర్పు ముఖంగా ఈ మంత్రాన్ని 19 మార్లు జపమాల మంత్రాన్ని జపించండి.

జపం పూర్తి చేసిన తర్వాత శివయ్యకు డ్రై ఫ్రూట్స్‌ను ప్రసాదంగా సమర్పించండి. అనంతరం హారతి ఇచ్చి ప్రార్ధించండి.

జ్ఞానం పొందడం కోసం

జ్ఞానం పొందడానికి శివుని యోగేశ్వర్ రూపాన్ని పూజించండి.

ఆలయంలో మట్టి శివలింగాన్ని ప్రతిష్టించి పంచోపచార పూజలు చేయండి. ఓం నమో భగవతే వ్యాఘ్ర రుద్రాయ స్వాహా మంత్రాన్ని నీలిరంగు దుప్పటి మీద కూర్చుని జపించండి.

ఈ మంత్రాన్ని ఉత్తరాభిముఖంగా కూర్చుని 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. జపం పూర్తయిన తర్వాత శివుడికి బిల్వ పత్రాలు, మారేడు పండు సమర్పించండి. పూజ ముగింపులో హారతి ఇచ్చి ప్రార్ధించండి.

అదృష్టం కోసం

పూజా స్థలంలో క్రిస్టల్ శివలింగాన్ని ప్రతిష్టించండి. పళ్లెంలో పండ్లు, పూలు, స్వీట్లను సమర్పించి పంచోపచారాలతో శివుడిని పూజించాలి.

ఎరుపు దుప్పటి మీద కూర్చొని “ఓం నమో భగవతే వ్యోమ రుద్రాయ స్వాహా” అనే మంత్రాన్ని జపించండి.

ఈ మంత్రాన్ని జపించేటప్పుడు, జపమాలను కప్పి ఉంచి గుండెకు దగ్గరగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.

ఈ మంత్రం జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి మంత్రాన్ని 7 సార్లు జపించండి.

మంత్రాన్ని పఠించిన తర్వాత శివునికి బియ్యం పాయసాన్ని ప్రసాదంగా అందించండి. హారతి ఇచ్చి శివుడిని ప్రార్ధించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి