Lord Shani Puja: జాతకంలో శని దోషమా.. ఇబ్బందులు పడుతుంటే ఈ 4 నివారణ చర్యలతో శనీశ్వరుడి ఆశీస్సులు మీ సొంతం

జాతకంలో శని గ్రహం స్థానం బలపడుతుందని.. జీవితంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకం. శనిశ్వరుడి కోపం కూడా చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో శని దోష నివారణకు పరిష్కారంతో పాటు.. మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. నిజమైన భక్తితో శనిశ్వరుడిని పూజించాలి. శనివారం శనిశ్వరుడిని ఆరాధించడానికి ప్రభావవంతంగా ఉండే 4 నివారణ చర్యలు ఈ రోజు తెలుసుకుందాం..

Lord Shani Puja: జాతకంలో శని దోషమా.. ఇబ్బందులు పడుతుంటే ఈ 4 నివారణ చర్యలతో శనీశ్వరుడి ఆశీస్సులు మీ సొంతం
Lord Shani Dev
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2024 | 10:56 AM

శనివారం శని భగవానుడికి అంకితమైనదిగా రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శనిశ్వరుడిని పూజిస్తారు. జాతకంలో శనిదోషం ఉన్నవారు శనిశ్వరుడిని ఆరాధిస్తే అది తొలగిపోతుంది. శనిశ్వరుడిని ఆరాధించే సమయంలో ఈ 4 చర్యలు పాటించడం వలన జాతకంలో శని గ్రహం స్థానం బలపడుతుందని.. జీవితంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకం. శనిశ్వరుడి కోపం కూడా చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో శని దోష నివారణకు పరిష్కారంతో పాటు.. మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. నిజమైన భక్తితో శనిశ్వరుడిని పూజించాలి. శనివారం శనిశ్వరుడిని ఆరాధించడానికి ప్రభావవంతంగా ఉండే 4 నివారణ చర్యలు ఈ రోజు తెలుసుకుందాం..

శనివారాలు ఉపవాస దీక్ష

శనిశ్వరుడికి కోపం చాలా త్వరగా వస్తుందని.. ఒకసారి కోపం వస్తే త్వరగా పోదని జ్యోతిష్కులు చెబుతున్నారు. అయితే కొన్ని చర్యలు శనిశ్వరుడి ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 51 శనివారాలు శనిశ్వరుడి పేరున ఉపవాసం ఉండి మంత్రాలు పఠిస్తే మేలు జరుగుతుంది. 51 వారాల పాటు శనివారం ఉపవాసం చేయలేకపోయినట్లు అయితే.. 19 రోజులు అయినా ఉపవడం చేయవచ్చు. ఇది ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. శనిశ్వరుడి కోపాన్ని తగ్గిస్తుంది. శాంతపరుస్తుంది.

జపించాల్సిన మంత్రాలు ఏమిటంటే

శనిశ్వరుడి మీపై కోపంగా ఉంటే కొన్ని మంత్రాలతో ప్రసన్నం చేసుకోవచ్చు. ఓం ప్రాం ఫ్రీం ప్రోం స: శనైశ్చరాయ నమః. (ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः) అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాదు మహామృత్యుంజయ మంత్రం పఠించడం ద్వారా శనిశ్వరుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మంత్రాలను 5 సార్లు జపించండి. ఇది ప్రయోజనకరంగా నిరూపించబడింది. అంతేకాదు శనివారం హనుమంతుడిని, శివుడిని పూజించడం వలన కూడా ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనె

శనిశ్వరుడిని పూర్తి ఆచారాలతో, క్రమం తప్పకుండా పూజించాలి. శని దోషం ఎవరికీ అంత త్వరగా పోదని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో శనిశ్వరుడికి నువ్వులు లేదా ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పించి.. నల్లని వస్త్రాలను దానం చేస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. శని దోషం నుండి విముక్తి పొందవచ్చు.

ఏ చెట్టును పూజించాలంటే

జాతకంలో శని దోషం ఉన్నా.. శని స్థానం బలహీనంగా ఉన్నవారు రావి చెట్టును పూజించడం నీరు సమర్పించడం ఫలవంతం అని నమ్ముతారు. హిందూ మతంలో రావి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలు మునుపటి కంటే చాలా తగ్గుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి