Maha Purusha Yoga: తులా రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి మహా పురుష యోగం..!
ఈ నెల 19 నుంచి అక్టోబర్ 13 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచరించడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, అదృష్టా లకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు మాలవ్య మహా పురుష యోగం పట్టడం జరుగుతుంది. ఏ
ఈ నెల 19 నుంచి అక్టోబర్ 13 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచరించడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, అదృష్టా లకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు మాలవ్య మహా పురుష యోగం పట్టడం జరుగుతుంది. ఏ రాశికైనా 1,4,7,10 స్థానాల్లో, అంటే కేంద్ర స్థానాల్లో, శుక్రుడు ఉచ్ఛ, స్వస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మాలవ్య మహా పురుష యోగం ఏర్పడు తుంది. ఈ యోగం వల్ల ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ప్రాధాన్య స్థానం పొందడం, సామాజికంగా ప్రముఖులుగా గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు మాలవ్య మహా పురుష యోగం కలగడంతో పాటు, మిథునం, కన్యా రాశులకు మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీని వల్ల సంపదలు, భోగ భాగ్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి సంబంధం నిశ్చయం కావడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు విశేష లాభాలనిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పడతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
- మిథునం: ఈ రాశికి పంచమ కోణంలో శుక్ర సంచారం వల్ల సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో, సంపన్నులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. పని చేస్తున్న సంస్థలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడంతో పాటు స్వయంగా ప్రముఖుడుగా, పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందడం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అయి సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు, వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి.
- కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల మహాభాగ్య యోగం ఏర్పడింది. దీని వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆదాయపరంగా కొత్త అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభించే సూచనలున్నాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో అనుకున్న శుభ కార్యాలు జరుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది. బ్యాంక్ నిల్వలు బాగా పెరుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణీ అవుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలకు ఆశించిన గుర్తింపు లభించి, డిమాండ్ పెరుగుతుంది. ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ ఘన విజయం సాధిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరిగి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.