Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 21, 2024 వరకు): లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు ఉన్నందువల్ల మేష రాశి వారి ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆర్థిక సమస్యలన్నీ క్రమంగా పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారు ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి కార్యం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 15, 2024 | 5:01 AM

1 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆర్థిక సమస్యలన్నీ క్రమంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. అన్ని విధాలుగానూ ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు తగ్గట్టుగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫ లితాలనిస్తాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు తెచ్చు కుంటారు. వ్యాపారాల్లో పోటీదార్లను అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధుమిత్రులు మీ మీద ఆధారపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. దుర్గాదేవిని తరచూ స్తుతించడం వల్ల విజయాలు సిద్ధిస్తాయి.

2 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇదే రాశిలో ఉన్న గురువు వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయ వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడ తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతుండడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం లభించే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా సాగి పోతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది కానీ, పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ పరిస్థితులు ఉత్సాహం కలిగిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శివార్చన చేయించడం వల్ల ఉద్యోగ జీవితంలో ఒక ప్రాభవం పెరుగుతుంది.

3 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు, రవి బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, రాశిలో కుజ సంచారం వల్ల ప్రతి పనినీ గట్టి ప్రయత్నంతో సాధించుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి కార్యం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో పరిణామాలు చోటు చేసుకుం టాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లి తండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. రాహు కేతువులకు మంచి పరిహారం చేయించడం మంచిది.

4 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ధన స్థానంలో బుధ, రవులు, లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ ఆశిం చిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగు లకు ఆశించిన సమాచారం లభిస్తుంది. ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా సఫలం అవు తాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరో గ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

5 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కుజుడు, ధన స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. శుభ గ్రహాల అనుకూల సంచారం ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయ త్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యో గులకు ఉద్యోగ యోగం పడుతుంది. తరచూ శివాలయంలో అర్చన చేయించడం చాలా మంచిది.

6 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు రవి కలిసి ఉండడం, భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల, ఆర్థిక యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. షష్ట స్థానంలో శని ఉన్నంత కాలం శత్రు, రోగ, రుణ బాధల బెడద ఎక్కువగా ఉండక పోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందు తాయి. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. అన వసర స్నేహాలు ఏర్పడతాయి. విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల ఆదాయ సమస్యలు తగ్గుతాయి.

7 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారం మధ్యలో ఈ రాశిలోకి రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల సర్వత్రా విజయాలు సిద్ధి స్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.  ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగు తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. సుందరకాండ పారాయణ వల్ల శుభ ఫలితాలు ఎక్కువవుతాయి.

8 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సప్తమ స్థానంలో గురువు, దశమ, లాభ స్థానాల్లో బుధ, రవులు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ప్రతి విషయంలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. మధ్య మధ్య కొద్దిగా ఆర్థిక నష్టం కూడా తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఆహార విహారాల్లోనే కాకుండా, ప్రయాణాల్లో కూడా జాగ్ర త్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సాను కూలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రతి రోజూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవలసిన అవసరం ఉంది.

9 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో శని, భాగ్య, దశమ స్థానాల్లో బుధు, రవి, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులతో పాటు, ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో పలుకు బడికి లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడు తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరు గుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రతి రోజూ గణపతి నామ స్మరణ మంచిది.

10 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశినాథుడైన శని ధన స్థానంలో ఉన్నంత కాలం ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు. పంచమంలో గురువు, షష్టంలో కుజుడి సంచారం వల్ల ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు ప్రాధాన్యం, ప్రాభ వం కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగ స్వామి సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. కొద్ది రోజుల పాటు రోజూ శివార్చన చేయించడం మంచిది.

11 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు, ఇతర అనుకూలతలకు లోటుండకపోవచ్చు. ఇంటా బయటా గౌరవ మర్యా దలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. పని భారం ఎక్కువగాపూ ఉన్నా సంపాదనకు మాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రోజూ కాలభైరవాష్టకం చదువుకోవడం అవసరం.

12 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు తృతీయంలోనూ, ధనాధిపతి కుజుడు చతుర్థ స్థానంలోనూ సంచారం చేస్తు న్నందువల్ల కుటుంబ వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా మారతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడడం జరుగుతుంది.  ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. వీలైనప్పుడు చిన్నపాటి అన్నదానం చేయించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

13 / 13
Follow us