నేడు జమ్మూలో ప్రధాని మోడీ పర్యటన.. ఎన్నికల ప్రచారం.. బారాముల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని పట్టన్ ప్రాంతంలో శనివారం రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు పాఠశాల భవనంలో ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పోలీసుల సంయుక్త బృందం అనుమానాస్పద ప్రదేశానికి చేరుకున్నారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని ఆర్మీ అధికారి చెప్పారు. శుక్రవారం రాత్రి ఒక ఉగ్రవాది హతమవ్వగా.. శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బారాముల్లాలోని చక్ పత్తర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదులను గుర్తిస్తున్నారు. శుక్రవారం పోలీసులు సైన్యం సంయుక్తంగా చేపట్టిన బృందంగా కలిసి ఈ ప్రాంతంలో కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఇందులో సైన్యం విజయవంతంగా పని పూర్తి చేసింది. ఉగ్రవాదులను హతమార్చింది.
మరోవైపు సెప్టెంబరు 18న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జమ్మూలోని దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఒకవైపు జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్‌లో శనివారం కూడా భద్రతా సిబ్బంది.. ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో శుక్రవారం ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు ఆర్మీ అధికారులు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రధాన ఉగ్రవాద ఘటనల వివరాల్లోకి వెళ్తే..
- జూన్ 11న కథువలోని హీరానగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఒక సైనికుడు కూడా వీరమరణం పొందాడు.
- జూన్ 12న దోడాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక ఉగ్రవాది .. ఆర్మీ బృందంపై దాడి చేశాడు.. ఒక పోలీసు గాయపడ్డాడు.
- జూన్ 26న దోడాలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు.
- జులై 7న రాజౌరిలోని మంజాకోట్‌లోని సైనిక శిబిరంపై ఉగ్ర దాడి జరిగింది. ఇందులో ఒక సైనికుడు గాయపడ్డాడు.
- జూలై 8న, కథువాలో సైనిక వాహనంపై తీవ్రవాద దాడి జరిగింది. ఇందులో 5 మంది సైనికులు అమరులయ్యారు. 5 మంది గాయపడ్డారు.
- జూలై 15న దోడాలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
- ఆగస్టు 11న అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.
2024లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారు?
2024లో ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తూనే ఉన్న్నాయి. కొంత మేర విజయం సాధించాయి. అనేక మంది ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఏ నెలలో ఎంత మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయో తెలిసి జేస్తూ సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ఒక నివేదికను ప్రచురించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..