Jammu and Kashmir: కిష్త్వార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు, ఇద్దరు జవాన్లు వీరమరణం, ఇద్దరికి గాయాలు

భద్రతా వలయంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం. రెండు వైపుల నుంచి భారీ షెల్లింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాల బృందాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పర్వతాలు, దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Jammu and Kashmir: కిష్త్వార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు, ఇద్దరు జవాన్లు వీరమరణం, ఇద్దరికి గాయాలు
Jammu Kashmir EncounterImage Credit source: file photo
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2024 | 7:41 AM

జమ్మూ కష్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదుల దాడులు చోటబాట్లు పెరిగిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా వరసగా ఉగ్రవాదులు, భారత ఆర్మీ జవాన్ల మధ్య ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్నీ కిష్త్వార్‌లోని చత్రు ఆసుపత్రికి చెందిన డాక్టర్ అష్రఫ్ గిరి తెలిపారు. భద్రతా వలయంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం. రెండు వైపుల నుంచి భారీ షెల్లింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాల బృందాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పర్వతాలు, దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

ఈ క్రమంలో కిష్త్వార్‌లోని చత్రుకే అడవిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీనిపై భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆపరేషన్‌ ప్రారంభించింది. ఈ సమయంలో తమని చుట్టుముట్టిన ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ప్రతీకార చర్యతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు జవాన్లు మరణించారు.

ఇవి కూడా చదవండి

కతువాలో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు టాప్ కమాండర్లు హతం

బుధవారం తెల్లవారుజామున కతువా జిల్లాలోని ఖండారా ప్రాంతంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్‌కు చెందిన టాప్ కమాండర్లు. వారి నుంచి ఎం-4, ఏకే సిరీస్ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సున్నితమైన ప్రాంతంలో ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెబుతున్నారు.

Kathua

కతువా ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మరియు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాదుల నుంచి మారణాయుధాలు స్వాధీనం

జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను నిర్మూలించినందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసు డీజీపీ ఆర్ఆర్ స్వైన్ భద్రతా బలగాలను అభినందించారు. ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను సైనికులు విజయవంతంగా హతమార్చారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో NVD, బైనాక్యులర్‌లతో కూడిన M-సిరీస్ రైఫిల్స్‌ కూడా ఉంది.

కుప్వారాలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

బుధవారం కుప్వారాలోని ఎల్‌ఓసి సమీపంలోని కెరాన్ సెక్టార్ నుంచి భద్రతా దళాలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా కెరాన్ సెక్టార్‌లో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. ఆ ప్రాంతంలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇందులో AK 47 కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌లు, IEDల తయారీలో ఉపయోగించే పదార్థాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..