AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఏమిటయ్యా గణేషా.. నీ చరణ స్పర్శ ఉన్నోళ్లకే కానీ పేదోళ్లకు లేదా..లాల్‌బాగ్చా రాజా పండల్ వీడియోలు వైరల్..

గణేష్ ఉత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలోని వీధి మొత్తం ఎలా వెలిగిపోతుందో చూపించే డ్రోన్ షాట్‌లు లేదా వీడియోలున్నాయి. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో గణపతి మండపం దగ్గర ఉన్న రద్దీని.. నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న బౌన్సర్‌లు సాధారణ భక్తుల పట్ల చూపిస్తున్న తీరుని కూడా చూపిస్తున్నాయి.

అయ్యో ఏమిటయ్యా గణేషా.. నీ చరణ స్పర్శ ఉన్నోళ్లకే కానీ పేదోళ్లకు లేదా..లాల్‌బాగ్చా రాజా పండల్ వీడియోలు వైరల్..
Lalbaug Cha Raja Ganesh
Surya Kala
|

Updated on: Sep 14, 2024 | 10:06 AM

Share

వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా మహారాష్ట్ర గుర్తుకొస్తుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అత్యధికంగా సందర్శించే గణపతి మండపంలోని ఒకటైన లాల్‌బాగ్చా రాజా గణపతి మండపంకి సంబంధించిన విజువల్స్ ఆన్‌లైన్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో లాల్‌బాగ్చా రాజా రోజువారీ దర్శన ఫోటోలు, పండల్‌ను సందర్శిస్తున్న భక్తులు, దర్శన క్యూ లైన్ లో వెళ్తున్న ప్రముఖులవి ఉన్నాయి.గణేష్ ఉత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలోని వీధి మొత్తం ఎలా వెలిగిపోతుందో చూపించే డ్రోన్ షాట్‌లు లేదా వీడియోలున్నాయి. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో గణపతి మండపం దగ్గర ఉన్న రద్దీని.. నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న బౌన్సర్‌లు సాధారణ భక్తుల పట్ల చూపిస్తున్న తీరుని కూడా చూపిస్తున్నాయి.

ఒక్క వీడియోలో కాదు చాలా వీడియోల్లో కొంత మంది మహిళా బౌన్సర్లు.. గణపతి చరణాలను స్పర్శించిన వెంటనే ప్రజలను నెట్టడం కనిపిస్తోంది. అంత సేపు క్యూ లో నిల్చుని గణపతి వద్దకు చేరుకున్న భక్తులు కనీసం నిమిషం పాటు గణపతిని ప్రార్థించడానికి కూడా వీలు లేదు. ఇతరులను కూడా దర్శనానికి వీలు కల్పిస్తూ ప్రాంగణం నుండి బయటకు వెళ్లమని కోరుతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూలో నిల్చుని ఉండడం వలన ఇతరులకు దర్శనం చేసుకునే వీలు కల్పించడానికి ఇలా చేయడం న్యాయంగా పరిగణించబడుతోంది. అయితే ఇదే మండపం వద్ద VIPల పట్ల ప్రవర్తించిన తీరుని చూసిన సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

లాల్‌బాగ్చా రాజా దర్శనానికి వెళ్ళే సామాన్యుల పట్ల వాలంటీర్లు, నిర్వాహకులు భక్తునితో ఎలా ప్రవర్తిస్తారో తెలియజేస్తున్న వీడియోతో పాటు అక్కడికి వచ్చే VIPల పట్ల ప్రవర్తిస్తున్న తీరు కూడా తెలియజేసే వీడియో పోల్చి చూస్తూ మండిపడుతున్నారు. సెలబ్రేటీలు వినాయకుడి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత లాల్‌బాగ్చా రాజా పాదాలను తాకడమే కాదు గణపతి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. వీఐపీలు కాసేపు అక్కడ నిల్చున్న వీడియోల్లో క్యూలో ఉన్న కొంత మంది భక్తులను త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళమన్నట్లు బయటకు నెట్టడాన్ని చూపిస్తున్నాయి.

ఈ వీదియోలపై నెటిజన్లు స్పందిస్తూ భవిష్యత్తులో లాల్‌బాగ్చా రాజా పండల్‌ను వీఐపీగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ముంబై పోలీసులు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు అధిక సమయం తీసుకోవాలి.. లేకుంటే నెమ్మదిగా సామాన్య ప్రజల లాల్‌బాగ్చా రాజా గణపతి దర్శనానికి దూరం అవ్వొచ్చు అని సూచిస్తున్నారు. నెటిజన్లు పండల్‌ను సందర్శించే సామాన్య భక్తుడిని వీఐపీని సమానంగా చూడడంలో నిర్వాహకులు విఫలమయ్యారంటూ ఆరోపిస్తున్నారు.

ఈ సంవత్సరం లక్షలాది మంది సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకుల నుండి సినీ తారల వరకు పలువురు ప్రముఖులు ఇప్పటికే లాల్‌బాగ్చా రాజాను సందర్శించుకున్నారు. అమిత్ షా, సోనాల్ షా దంపతులు, ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ థాకరే, రాజ్ థాకరే, దీపక్ కేసర్కర్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, విక్కీ కౌశల్, ఆయుష్మాన్. ఖురానా, శ్రియా పిల్గావ్కా, భువన్ బామ్ సహా అనేక మంది ప్రముఖులున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..