AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Port Blair: ఈ ప్రదేశం భూతల స్వర్గం.. శ్రీ విజయపురంగా పేరు మార్చుకున్న స్వర్గధామం గురించి తెలుసుకోండి..

పోర్ట్ బ్లెయిర్ అండమాన్ , నికోబార్ లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. నిన్నటి వరకూ పోర్ట్ బ్లెయిర్.. నేటి నుంచి శ్రీ విజయపురం. ఇక్కడ సందర్శించే వారికి ఓ స్వర్గధామం అనిపిస్తుంది. ఇక్కడ బీచ్‌లలో ప్రకృతి మధ్య సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి కూడా అద్భుతమైనది. కనుక ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఆస్వాదించవచ్చు. ఈ నేపధ్యంలో శ్రీ విజయపురంలో చూడదగిన ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం..

Port Blair:  ఈ ప్రదేశం భూతల స్వర్గం.. శ్రీ విజయపురంగా పేరు మార్చుకున్న స్వర్గధామం గురించి తెలుసుకోండి..
Port Blair Name Changed
Surya Kala
|

Updated on: Sep 14, 2024 | 9:05 AM

Share

భారత ప్రభుత్వం ఇప్పుడు మరొక చారిత్రక ప్రాంతం పేరుని మార్చింది. హిందూ మహాసముద్రం తూర్పున ఉన్న అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును ఇప్పుడు ‘శ్రీ విజయపురం’గా మార్చింది. సొంత చరిత్ర కలిగిన ఈ ప్రదేశం ప్రకృతి అందాలకు నెలవు. స్వర్గధామం కంటే తక్కువేమీ కాదు.. ప్రకృతి ప్రేమికుల సందర్శనకు గొప్ప ప్రదేశం. ఈ ప్రదేశం ఏ విదేశీ పర్యాటక ప్రదేశం అందాల కంటే తక్కువ కాదు. ప్రశాంతమైన బీచ్, నీలిరంగు నీరు, ప్రకృతి పచ్చదనం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాదు పోర్ట్ బ్లెయిర్‌లో సందర్శించదగిన అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. అవి దేశ చరిత్ర, సంస్కృతిని మనకు పరిచయం చేస్తాయి.

పోర్ట్ బ్లెయిర్ అండమాన్ , నికోబార్ లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. నిన్నటి వరకూ పోర్ట్ బ్లెయిర్.. నేటి నుంచి శ్రీ విజయపురం. ఇక్కడ సందర్శించే వారికి ఓ స్వర్గధామం అనిపిస్తుంది. ఇక్కడ బీచ్‌లలో ప్రకృతి మధ్య సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి కూడా అద్భుతమైనది. కనుక ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఆస్వాదించవచ్చు. ఈ నేపధ్యంలో శ్రీ విజయపురంలో చూడదగిన ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం.

సెల్యులార్ జైలు భారతదేశ పోరాటానికి నిదర్శనం

1906లో బ్రిటిష్ వారు పోర్ట్ బ్లెయిర్ నగరంలోని అట్లాంటా పాయింట్ వద్ద సెల్యులార్ జైలును నిర్మించారు. ఈ మూడు అంతస్తుల జైలు భారత ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేస్తుంది. వినాయక్ దామోదర్ సావర్కర్, దివాన్ సింగ్, బుట్కేశ్వర్ దత్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్రదేశంలో ఖైదు చేయబడ్డారు. ఎవరైనా శ్రీ విజయపురానికి వెళ్తే.. ఈ ప్రదేశాన్ని ఒకసారి తప్పక సందర్శించండి.

ఇవి కూడా చదవండి

సాముద్రిక నావల్ మెరైన్ మ్యూజియం

పోర్ట్ బ్లెయిర్‌లోని సాముద్రిక నావల్ మారిటైమ్ మ్యూజియాన్ని సందర్శించడం కూడా ఒక మంచి అనుభూతినిస్తుంది. ఇక్కడ నిర్మించిన అంతర్నిర్మిత అక్వేరియం కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో సముద్రపు మొక్కల నుండి జంతువుల వరకు అనేక జాతులు ఉన్నాయి.

ఫోటోగ్రఫీకి ఇది గొప్ప ప్రదేశం

సహజ దృశ్యాలు, జంతువులు, పక్షుల ఫోటోగ్రఫీని ఇష్టపడే వ్యక్తులలో మీరు ఒకరు అయితే.. శ్రీ విజయపురం ( పోర్ట్ బ్లెయిర్) నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిడియా తపు అనే ద్వీపం. దట్టమైన అడవులతో నిండి ఉన్న ఈ ప్రదేశంలో లెక్కలేనన్ని రకాల పక్షులను చూడవచ్చు. సూర్యాస్తమయం దృశ్యం కూడా చాలా అందంగా ఉంటుంది.

మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్

శ్రీ విజయపురం వెళితే ఖచ్చితంగా మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్‌ని సందర్శించండి. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీనిని బందూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. అనేక అందమైన సముద్ర జీవులు ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ పార్క్ సముద్ర జీవులను సంరక్షించడానికి నిర్మించబడింది. అంతేకాదు ఈ మెరైన్ పార్క్‌లో స్కూబా డైవింగ్, బోటింగ్, స్నార్కెలింగ్ వంటి సాహసాలను కూడా చేయవచ్చు.

మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్

శ్రీ విజయపురం నుంచి కొంత దూరం ప్రయాణిస్తే అంటే 43 కిలోమీటర్ల దూరంలో మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ వివిధ రకాల మొక్కలు, వివిధ రకాల జాతుల జంతువులు, పక్షులు చూడవచ్చు. అంతేకాదు ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం దృశ్యం కూడా అందంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..