AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణేష్ మండపం వద్ద వింత దృశ్యం.. మోదకం తీసుకునే ముందు గణపతికి నమస్కరించిన మూషికం.. నెట్టింట వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ధిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన మండపాలలో వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే తాజాగా ఓ మండపం దగ్గరకు బుజ్జి గణపతి వాహనం అయిన ఓ ఎలువ వచ్చింది. అది గణపతిని ప్రార్ధిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

గణేష్ మండపం వద్ద వింత దృశ్యం.. మోదకం తీసుకునే ముందు గణపతికి నమస్కరించిన మూషికం.. నెట్టింట వీడియో వైరల్
Rat Video Vairal
Surya Kala
|

Updated on: Sep 14, 2024 | 8:10 AM

Share

మహారాష్ట్ర థానే జిల్లాలోని మీరా భయందర్‌లో ఒక గణేష్ మండపంలోని గణపతి వాహనమైన ఒక ఎలుక ప్రవేశించింది. ఆ ఎలుక కొన్ని సెకన్ల పాటు గణపతి విగ్రహాన్ని దణ్ణం పెడుతూ కనిపించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గణపతి వాహనం అయిన ఎలుక గణపతి విగ్రహం పాదాల క్రింద నిలబడి రెండు కాళ్ళ మీద నిలబడి.. ముందు రెండు కాళ్లను ఎత్తి.. చేతులుగా మార్చి జోడించి నమస్కరించిన అరుదైన దృశ్యం కనిపించింది. మండపంలో ఉన్న ప్రసాదాన్ని తీసుకోకముందు ఎలుక వినాయకుడికి దణ్ణం పెడుతున్న దృశ్యం అక్కడ ఉన్న సీసి కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ మరియు ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గణేష్ పండలో ప్రార్థన చేస్తున్న ఎలుక

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sai Samarpan (@sai_samarpan_cha_raja)

ఎలుక గణపతి మండపం ప్రాంగణంలోకి వచ్చి గణపతికి రెండు పాదాల మీద నిలబడి రెండు చేతులతో మొక్కి ప్రార్ధించింది. అనంతరం ఆ ఎలుక బప్పాకు నమస్కరిస్తూ పండల్ వద్ద ఉన్న ఒక లడ్డూ ప్రసాదాన్ని తీసుకెల్తోంది. మీరా-భయందర్ ప్రాంతంలోని సాయి సమర్పణ్ చ రాజా పండల్ లో ఈ ఎలుకకు సంబంధించిన వీడియోలు వెలువడ్డాయి. ఈ మండప అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పండల్ వద్ద మూషికం గణపతి బప్పాను ప్రార్థిస్తున్నట్లు చూపించే వీడియో తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. మోదకం తింటున్నట్లు చూపిస్తున్న మరొక వీడియో క్లిప్ సుమారు లక్ష వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ వీడియో వైరల్ పై ప్రజలు స్పందిస్తూ గణేష్ పండల్ వద్ద కనిపించిన ఎలుక ప్రదర్శించిన భక్తికి మెచ్చుకున్నారు. మోదకం తీసుకోవడానికి ముందు బప్పాను ప్రార్థించిన ఎలుకను చూస్తే.. జంతువులు దేవతల పట్ల ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తాయో తెలిసింది అని ఒకరు చెప్పారు. మరికొందరు నెటిజన్లు “గణపతి బప్పా మోరియా” అని రాశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి