- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips in telugu: keep the idol of Gajalakshmi In this corner of the house know its benefits
Vastu Tips: ఇంట్లో గజలక్ష్మి విగ్రహాన్ని పెట్టుకోవడానికి కొన్ని వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఏ దిశలో పెట్టుకోవడం శుభప్రదం అంటే
వాస్తు నియమాలు చాలా ముఖ్యమైనవి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫలితంగా జీవితంలో సంతోషం, శాంతి పెరిగి సమస్యలు తగ్గుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో దేవుళ్ళ , దేవతల విగ్రహాలు, చిత్రాలను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. గజలక్ష్మి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే ఎంతో ఉపయోగకరం. గజ లక్ష్మి దేవి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఇంట్లో వాస్తు ప్రకారం పెట్టుకోవడం వలన ఆరోగ్యం, ఆనందం, అదృష్టం, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. గజలక్ష్మి చిత్రపటానికి సంబంధించిన వాస్తు చిట్కాలను తెలుసుకుందాం...
Updated on: Sep 12, 2024 | 12:16 PM

లక్ష్మీదేవి హిందూ మతంలో సంపద, శ్రేయస్సుకి సంబంధించిన అధిదేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఏనుగులతో కలిసి ఉన్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు. గజ లక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంపద పెరుగుతుంది. ఆమె అదృష్టం, శ్రేయస్సుని ఇచ్చే దేవతగా పరిగణించబడుతుంది.

గజలక్ష్మి కమలం మీద పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుంది. నాలుగు చేతుల్లో వెనుక రెండు చేతుల్లో రెండు తామర పువ్వులను పట్టుకొని ఉంటుంది.

గజలక్ష్మి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా గజ అంటే ఏనుగు.. లక్ష్మీదేవితో పాటు ఏనుగు తామర పువ్వుతో నిలబడి ఉన్న చిత్రం శుభప్రదమైన చిత్రంగా పరిగణించబడుతుంది.

గజలక్ష్మిని ఆరాధించడం ద్వారా వ్యక్తి రుణ విముక్తి పొంది వ్యాపారంలో విజయాన్ని పొందుతాడని నమ్మకం. గజ లక్ష్మికి చెందిన ఈ రూపాన్ని పూజించడం చాలా ఫలవంతమైనది. అయితే ఇంట్లో సరైన స్థలంలో గజలక్ష్మి దేవి చిత్ర పటం ఉంచడం ముఖ్యం.

ఈ గజలక్ష్మి ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం, విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక గజలక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయి.

గజలక్ష్మి చిత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో (ఈశాన్య దిశలో) లేదా పూజ గదికి కుడి వైపున ఉంచడం శ్రేయస్కరం. గజలక్ష్మి ఫోటోని ఉత్తరం దిక్కున పెట్టుకోవచ్చు.




