Gold and Silver Cost Today: స్వల్పంగా దిగి తగ్గిన బంగారం ధర..అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇప్పుడు బంగారం ఒక మంచి పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బంగారం ధరలు ఏరోజుకారోజు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇటీవల కాలంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 16 వ తేదీ) న గోల్డ్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Cost Today: స్వల్పంగా దిగి తగ్గిన బంగారం ధర..అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2024 | 7:18 AM

మానవ జీవిత చరిత్రలో బంగారం కీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే ఇది విలువ, మార్పిడి మాధ్యమంగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ప్రస్తుతం బంగారాన్ని ఆభరణాల కోసమే కాదు సురక్షితమైన ఆస్తిగా కూడా పరిగణిస్తున్నారు. ఎప్పుడైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే బంగారం ఆదుకుంటుంది అని నమ్ముతారు. అందుకనే ఇప్పుడు బంగారం ఒక మంచి పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బంగారం ధరలు ఏరోజుకారోజు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇటీవల కాలంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 16 వ తేదీ) న గోల్డ్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

భారతదేశంలో ఈరోజు (సోమవారం సెప్టెంబర్ 16 వ తేదీ) 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ, 6,864 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 7,488గా కొనసాగుతోంది.

హైదరాబాద్ లో నిన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 68,650 ఉండగా ఈ రోజు (సోమవారం సెప్టెంబర్ 16 వ తేదీన)పది రూపాయలు తగ్గి.. 10 గ్రాముల ధర రూ. 68,640గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,890 ఉండగా ఈ రోజు (సోమవారం సెప్టెంబర్ 16 వ తేదీన)పది రూపాయలు తగ్గి.. 10 గ్రాముల ధర రూ. 74,880గా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు పసిడి ధరలు

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 68,790 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,030లకు చేరుకుంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 68,640, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,880గా కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 68,640, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,880ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 68,640, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,880గా కొనసాగుతోంది.

వెండి ధర ఎలా ఉన్నదంటే

బంగారం తర్వత అత్యధికంగా కొనే లోహం వెండి. పండగలు, ఫంక్షన్లు వస్తే చాలు వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపధ్యంలో ఒకానొక సమయంలో వెండి ధర ఆల్ టైం హై కి చేరుకుంది. అప్పటి నుంచి బంగారం బాటలోనే పయనిస్తూ వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు కూడా కొంత మేర వెండి ధర దిగి వచ్చింది. వెండి ధ‌ర కేజీకి ప్రామాణికంగా తీసుకుంటారు కనుక నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరమైన హైదరాబాద్ లో ఈ రోజు కిలో వెండి రూ. 96900ఉంది. నిన్న కంటే ఈ రోజు వంద రూపాయలు తగ్గింది. ఇదే ధర విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఉన్నాయి. అయితే డిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి ధర మరింత తక్కువగా అంటే రూ. 91,900లు గా ఉంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం, వెండి ధరలు ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ ఆభరణాల నుంచి సేకరించిన సమాచారం. అలాగే ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి హెచ్చు తగ్గులు ఉండవచ్చు.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..